వాల్మికి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శ ప్రాయం :: జిల్లా కలెక్టర్ సి హెచ్.శివ లింగయ్య

జనగామ, అక్టోబర్ 20: వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శ ప్రాయం జిల్లా కలెక్టర్ శివలింగయ్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం వాల్మికి మహర్షి జయంతి సందర్బంగా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహనీయులు వాల్మికి మహర్షి అని తెలిపారు. కుటుంబ పోషణ కోసం వేటగాడుగా ఉన్న వాల్మీకి దొంగగా మారి, దారి దోపిడిలు చేసారని, ఆ తర్వాత నారద మహాముని దివ్యోపదేశంతో కొన్ని సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నారని ఆయన అన్నారు. ధ్యానం నుంచి బయటికి వచ్చాక ఎలాంటి అభ్యాసం, శిక్షణ లేకుండానే, వాల్మీకి మహర్షి తన దివ్య జ్ఞానంతో రామాయణ మహా కావ్యాన్ని మొట్టమొదటి సారిగా సంస్కృత భాషలో రచించారని ఆయన తెలిపారు. మొదటి సారిగా సంస్కృతంలో శ్లోకాలను రచించినందున వాల్మికి మహర్శి ఆది కవిగా, రామాయణానికి ఆది కావ్యం అని పేరు వచ్చినట్లు ఆయన అన్నారు. మనిషిలో మార్పు వస్తే మహర్షి కాగలరని నిరూపించి, చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయులు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రవీందర్, డిఆర్డీవో జి.రాంరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సుగుణాకర్ రాజు, కలెక్టరేట్ ఏవో మురళీధర్, జిల్లా అధికారులు, వాల్మీకి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post