వాల్మికి మహర్షి జీవిత చరిత్ర ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రిక ప్రకటన                                 తేది 20.10.2021
వాల్మికి మహర్షి జీవిత చరిత్ర ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు వాల్మికి జయంతి సందర్బంగా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వాల్మికి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యాన్ని రచించిన వారు శ్రీ వాల్మికి మహర్షి అని తెలిపారు. కుటుంబ పోషణ కోసం వేటగాడుగా ఉన్న వాల్మికి దొంగ గా మారి దారి దోపిడిలు చేసారని, ఆ తరువత నారద మహాముని దివ్యోపదేశం తో కొన్ని సంవత్సరాలుగా ధ్యానం లో ఉన్నారని తెలిపారు. ధ్యానం నుంచి బయటికి వచ్చాక ఎలాంటి అభ్యాసం , శిక్షణ లేకుండానే, వాల్మికి తన దివ్య జ్ఞానం తో రామాయణ మహా కావ్యాన్ని మొట్టమొదటి సారిగా సంస్కృతి బాష లో రచించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. మొదటి సారిగా సంస్కృతంలో శ్లోకాలను రచించినందున వాల్మికి మహర్శి కి ఆది కవి గా, రామాయణానికి ఆది కావ్యం అని పేరు వచిందని తెలిపారు. మనిషి లో మార్పు వస్తే మహర్షి కాగలరు అని నిరూపించి , చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వాల్మికి అని అన్నారు.
సమావేశం లో అదనపు కలెక్టర్ రఘు రామ్ శర్మ, డి.ఎస్.ఓ రేవతి, డి.పి.ఆర్.ఓ చెన్నమ్మ, బి.సి సంక్షేమ శాఖ సిబ్బంది బాల స్వామి, అబ్దుల్ హఫీజ్, శ్రీనివాసులు, వసతి గృహ అధికారులు రంజిత, ఈశ్వర్ రావు, శేకర్, కల్లెక్టరేట్ సిబ్బంది, వాల్మికి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————–
జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

Share This Post