వాల్మీకి అందరికీ ఆదర్శం – అదనపు కలెక్టర్‌ మను చౌదరి

దీక్ష, పట్టుదల, స్పందన ద్వారా మహర్షిగా ఎదిగిన వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం అని అదనపు కలెక్టర్‌ మను చౌదరి అన్నారు.
బుధవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించిన సందర్భంగా మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అదనపు కలెక్టర్‌ మను చౌదరి మాట్లాడుతూ.
వాల్మీకి మహర్షికి సంబంధించి ఎన్ని కథలు ఉన్నప్పటికీ వాటి సారాంశం ఆయన అట్టడుగు నుండి దీక్ష, పట్టుదల స్పందనతో ఒక మహర్షిగా ఎదిగినట్టు అర్థం అవుతుందన్నారు.
ఒక బోయవాడు పక్షి జంటలో ఒక పక్షిని చంపడంతో మరో పక్షి స్పందనను చూసి ఆయన జీవితంలో మార్పు వచ్చిందని తెలిపారు.
అదేవిధంగా ఎంతో దీక్ష, పట్టుదలతో 24 వేల శ్లోకాలతో ఆయన రచించిన రామాయణమే అత్యంత ప్రాచుర్యం తీసుకుని మన చుట్టూ జరుగుతున్న సంఘటనలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం మనకేం ఇచ్చిదని కాకుండా మనం దేశానికి ఏం చేశామని ఆలోచించాలని ఉద్బోధించారు. ఆయన ఆదర్శాలను నేటి యువతరం దినచర్యలో భాగంగా చేసుకుని ముందుకెళ్లితే మన జిల్లా, మన ఊరు ముందంజలో తీసుకెళ్లడానికి అంకితమై దీక్ష బూనాలని ఆశిస్తున్నామని తెలిపారు.
ఐక్య వాల్మీకి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మండ్ల సత్యనారాయణ మాట్లాడుతూ…
నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో
వాల్మీకి సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ను కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ అందుకు కావాల్సిన వినతిపత్రాన్ని సమర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ పిడి డిఆర్డిఎ నర్సింగ్ రావు డిపిఓ రాజేశ్వరి, సిపిఓ భూపాల్ రెడ్డి, ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ బాబు, ఏబిసిడిఓ శ్రీధర్ జి, వాల్మీకి సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆంజనేయులు, బాలస్వామి, రాములు, నరసింహ, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దొడ్ల నారాయణరెడ్డి కార్యదర్శి శివయ్య గౌడ్, కలెక్టరేట్ ఉద్యోగులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post