వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

బుధవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వాల్మీకి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, డిఆర్ఓ హరిప్రియ, బీసీ సంక్షేమ అధికారి విద్య, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది, తెలంగాణ వాల్మీకి బోయ సంఘం అధ్యక్షులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post