వాసవి మా ఇల్లు స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 11 లక్షల విలువైన వైకుంఠ రథం ను సోమవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా కు అందజేశారు

 

వాసవి మా ఇల్లు స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 11 లక్షల విలువైన వైకుంఠ రథం ను సోమవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా కు అందజేశారు . అట్టి వైకుంఠ రథం వాహనాన్ని సంగారెడ్డి మున్సిపాలిటీకి ఆయన అందించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ
ప్రతి మనిషి చనిపోయిన తర్వాత అంతిమ యాత్ర గౌరవంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వాసవి మా ఇళ్లు స్వచ్ఛంద సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తుందని, ప్రజలకు వివిధ రకాల సేవలు అందిస్తున్న వాసవి మా ఇల్లు సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బి .చంద్రశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి, మా ఇల్లు వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ గుప్తా, సంస్థ కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post