వాహనాలను పార్కింగ్ ప్రదేశాలలో నిలుపుదల చేయకపోతే చర్యలు… జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్

ప్రచురణార్థం

వాహనాలను పార్కింగ్ ప్రదేశాలలో నిలుపుదల చేయకపోతే చర్యలు…

మహబూబాబాద్ జూలై 7:

వాహనాలను పార్కింగ్ ప్రదేశాలలో నిలుపుదల చేయకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి పీ గౌతం హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ తన కార్యాలయానికి వెళుతూ ఎస్బిఐ బ్యాంకు వద్ద నిలుపుదల చేసిన వాహనాలను పరిశీలించారు. అనంతరం పక్కనే ఉన్న సెల్లార్ ను కూడా సందర్శించారు.

పట్టణానికి వివిధ పనులపై వచ్చే ప్రజలకు సెల్లార్లో పార్కింగ్ ప్రదేశాలుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. రహదారులపై నిలిపి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే జరిమానా విధిస్తామని అన్నారు. రామాలయం వద్ద నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులను పరిశీలించారు పనుల్లో నాణ్యత తో చేపట్టాలని నిర్వాహకులను ఆదేశించారు.
———————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post