వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలి. ఆత్మస్తైర్యంతో ముందుకెళ్లాలి.::: జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ.

వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని ఆదిశగా అనుబంధ శాఖ ద్వారా అర్హులైన ప్రతిఒక్కరు లబ్ది పొందాలని ఐసిడీఎస్  పి.డి. జ్యోతి పద్మ అన్నారు.  శుక్రవారం  కలెక్టరేట్  సమావేశ మందిరంలో మహిళ శిశు వికలాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ జిల్లాలో వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వికలాంగులు ఆత్మస్తైర్యం కోల్పోకుండా ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. ఐసీడిఏస్  ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రతి యొక్క వికలాంగులకు అభివృద్ధి ఫలాలు అందించి వారిలో మనోధైర్యం కల్పించి వారి జీవన శైలి మార్పుకోసం కృషిచేస్తుమని అన్నారు. మారుతున్న ఆధునిక సమాజానికి అనుగుణంగా సాంకేతిక పరమైన విజ్ఞాన్ని పెంపొందించుకోని  వికలాంగులు ముందజలో ఉండాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి ధీటుగా వికలాంగులు అన్ని రంగాలలో రణించాలనే ఉద్దేశంతో ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ,ల్యాప్ టాప్,4జీ స్మార్ట్ఫోన్లు అలాగే రవాణా ఇబ్బంది పడకుండా మోటోరిజెడ్ వెహికల్స్ ఉచితంగా అందజేస్తూ ,సకలాంగులు వికలాంగులను వివాహం చేసుకుంటే పారితోషకంతో పాటు సబ్సిడీ రుణాలు అందజేసి జీవన ఉపాధి  కల్పిస్తున్నా మని తెలిపారు. అదే విదంగా ఈ నెలలో జిల్లా కలెక్టర్ గారి అదేశాల మేరకు అంగన్వాడీ టీచర్ల ద్వారా వికలాంగుల సమగ్ర సర్వే నిర్వహించి పూర్తి స్థాయి నివేదిక ఆధారంగా వారి అవసరాలకు అనుగుణంగా ఉపకరణాలు పంపిణీ చేసి సబ్సిడీ రుణాలు అందజేయడం జరుగుతుందని  తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, rta అధికారి శ్రీకాంత్ ,డి ఆర్ డి ఏ అధికారులు, వికలాంగుల సంక్షేమం జిల్లా సమన్వయకర్త పోనుగోటి సంపత్ ,సీడీపీవోలు,సంక్షేమ చట్టం కమిటీ సభ్యులు నయిమ్, జహీర్ బాబా ,చిలక నాగేశ్వరరావు, వివిధ వికలాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలి.
ఆత్మస్తైర్యంతో ముందుకెళ్లాలి.
జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ.

Share This Post