వికలాంగులు మరియు వయోవృద్ధులకు అమలవుతున్న సంక్షేమ పథకాలలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కన్నా – తెలంగాణ ప్రభుత్వం మిన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

ప్రజా సంక్షేమమే కెసిఆర్ గారి ధ్యేయం…

వికలాంగులు మరియు వయోవృద్ధులకు అమలవుతున్న సంక్షేమ పథకాలలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కన్నా – తెలంగాణ ప్రభుత్వం మిన్న

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

—————————

దివ్యంగుల బాలికలకు హెల్త్ అండ్ నుట్రిషన్ కిట్లను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి గారు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో హెల్త్ కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్న దివ్యంగ బాలికల కోసం ప్రభుత్వం ప్రత్యేక స్కీమును ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా పాఠశాలకు వెళ్లలేకపోతున్న దివ్యాంగ బాలికలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు గాను ప్రతి ఒక్క బాలికకు 10 కిలోల గోధుమలు,అరకిలో నెయ్యి
ఒక కిలో ఖర్జూరం,75 గ్రాముల ప్రోటీన్ బిస్కెట్లు, ఎనిమిది వందల మిల్లీ లీటర్ల ఐరన్ జింక్ సిరప్, 90 కాల్షియం టాబ్లెట్లను కలిపి హెల్త్ అండ్ న్యూట్రిషనల్ కిట్టు పంపిణీ చేయడం చేయడానికి నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 132 మంది దివ్యాంగ బాలికలను బడిడు ఉన్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. దివ్యంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేకకార్యక్రమాలను చేపడుతుందన్నారు.

వారికి ఆసరా ఫించన్ కింద నెలకు రూ. 3016 ఇస్తుందన్నారు.

అందులైనా బాల బాలికలకు ప్రత్యేక విద్య బోధనకై ఉపాధ్యాయులకు అందుల విద్య బోధన శిక్షణ కేంద్రాలు

వికలాంగులను ప్రధాన స్రవంతిలో కలపడానికి ఉచితంగా అధునాతన ఉపకరణాల పంపిణీ

వివాహ ప్రోత్సాహక బహుమతులు

ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు

వికలాంగుల ప్రత్యేక విద్య కోసం ఆశ్రమ పాఠశాలలు,
వికలాంగ విద్యార్థులకు వసతి గృహాలు

వికలాంగుల కోసం రిజర్వ్ చేయబడిన బ్యాక్లాగ్ ఖాళీలను పూర్తి చేయుటకు ప్రత్యేక నియామక కమిటీ

వికలాంగులకు రుణాలు

ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు కల్పించడం

దివ్యాంగుల కోసం మానవతా దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారు అనేక కార్య్రమాలను చేపడుతున్నారని అన్నారు. బడిడు దివ్యాంగుల బాలికలకు పౌష్టికాహారం లోపం లేకుండా వారికి హెల్త్ అండ్ నూట్రిషన్ కిట్లను ఇవ్వడంజరుగుతుందని అన్నారు.

మన మంత్రివర్యులు కేటీఆర్ గారు వారి జన్మదినం సందర్భంగా తలపెట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా వికలాంగులకు ట్రై మోటార్ వెహికల్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, DWO లక్ష్మిరాజం, డిప్యూటీ సీఈఓ గీత, సిడీపీఓ లు ఎల్లయ్య, అలేఖ్య, దివ్యంగుల బాలికలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post