వికలాంగుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

వికారాబాద్ జిల్లా డిపిఆర్సి భవన్ లో జరిగిన ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వికలాంగులకు 5 శాతం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యా0గులకు రూ. 500/- లు ఉన్న పెన్షన్ ను ముఖ్యమంత్రి 3,000/- లకు పెంచారన్నారు .ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు.

ప్రతి నెల దాదాపు 5 లక్షల మందికి 3,016/- రూపాయలు ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని తెలియజేసారు. దేశంలోని ఇతర రాష్టాల్లో 70 శాంతం అంగ వైకల్యం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణలో మాత్రం 45 శాతం వైకల్యం ఉన్నా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు.
ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 3 శాతం నుండి 4 శాతానికి పెంచింది తెలంగాణ ప్రభుత్వమేనని,
ఎవరు కూడా వీరిపై చిన్న చూపు చూపవద్దని, సమాజంలో అందరితో పాటు వీరి అభివృద్ధిని కాంక్షించాలని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీరి గౌరవాన్ని పెంచేలా పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు.
సామాజిక సమైక్యతలో భాగంగా వికలాంగులు, సాధారణ వ్యక్తుల మధ్య వివాహాలను ప్రోత్సహించటానికి 50 వేల నగదు ప్రోత్సహాం ఉండగా ప్రస్తుతం అది లక్షకు పెంచటం జరిగిందన్నారు.
జిల్లాలో ఈ సంవత్సరంలో 20 మందికి వివాహ ప్రోత్సహకం అందించడం జరిగిందన్నారు.

వికలాంగులకు ఉచితంగా ట్రే సైకిల్స్, వీల్ ఛైర్స్, చెవి వినికిడి యంత్రాలు, ఉత కర్రలు ఉచితంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు.
వికలాంగుల కో అపరేటివ్ సంస్థ ద్వారా బ్రెయలి పలకలు, లాప్ టాప్ లు, మోటారు యంత్రాలు, అందించడం జరుగుతుందన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా చదువుకొనే విద్యార్థులకు లాప్ ట్యాప్ లు, స్మార్ట్ ఫోన్లు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ కింద బాగా పని చేసిన వికలాంగులకు మంత్రి,జడ్పీ చైర్మన్ ల చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. సబ్సిడీ కింద అంగవైకల్యం ఉన్న 8 మందికి 16 లక్షల రుణాల చెక్కులు అందించడం జరిగినది.
అంగన్ వాడి వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడం జరిగింది. ఫ్లోరైడ్ నీటి ద్వారా గతంలో చాలా మంది వికలాంగులుగా మారే వారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుండటం వల్ల
ఆ సమస్య కూడా చాలా వరకు తీరిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య ,జిల్లా లైబ్రరీ, డిసీసీబీ,డీసీఎంఎస్ ల చైర్మన్లు మురళీకృష్ణ, మనోహర్ రెడ్డి,కృష్ణారెడ్డి , జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా మహిళ,శిశు సంక్షేమ,దివ్యా0గుల,వయో వృద్ధుల అధికారి లలిత కుమారి, డిఆర్డిఓ కృష్ణన్, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post