వికలాంగుల దినోత్సవ సంబరాలు

ప్రచురనార్థం

డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా లోని గిరిజన భవనంలో ఉదయం 10 గంటలకు “వికలాంగుల దినోత్సవ” సంబరాలను జరుపుతున్నట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ దివ్యాంగుల సంక్షేమ అధికారిని నర్మద తెలిపారు.

కావున జిల్లా కమిటీ సభ్యులు, జిల్లాలో ని వికలాంగుల సంక్షేమ రిజిస్టర్ సంఘాల ప్రతినిధులు, వికలాంగుల సంక్షేమ స్వచ్ఛంద సంస్థలు సకాలంలో హాజరై దివ్యాంగుల దినోత్సవ వేడుకలను జయప్రదం చేయవలసిందిగా కోరారు.

Share This Post