వికారాబాద్ జిల్లాలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలు

కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతి ఉత్సవాలను వికారాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరములో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ, తన జీవితాన్ని ప్రజల అభ్యున్నతికి కొసం, దేశం కొసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొసం పోరాడిన ఉద్యమకారుడని తెలియజేసినారు. తెలంగాణ రాష్ట్రం కొసం తన పదవులకు రాజీనామా చేసిన వ్యక్తి అని, అయన స్ఫూర్తితో 2010 లో ఉద్యమంలో పాల్గొనడం జరిగిందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరున రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలుపెరుగని తెలంగాణ తొలిదశ, మాలిదశ పోరాట యోధుడని వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజల కొసం తపించేవారని, తన జీవితాన్ని నిస్వార్థంగా దేశం కొసం అంకితం చేసారన్నారు. భారత దేశ స్వతంత్ర ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. బాపూజీ ఆశయాలను, దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను మననం చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ బి సి సంఘం నాయకులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. బిసి సంక్షేమ శాఖ అధికారిని పుష్పలత, డీటీడిఓ కోటాజి, DSCDO మల్లేశం, ED SC కార్పొరేషన్ అధికారి బాబు మొజెస్, కలెక్టర్ కార్యాలయ ఏఓ హరిత, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, బిసి సంఘం, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post