వికారాబాద్ జిల్లాలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలు

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకోవేళ్తుందని, పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారాయని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
అహింస, సత్యాగ్రహం ఆయుధంగా దేశ స్వాతంత్ర్యము కోసం పోరు సల్పిన మహనీయులు మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, చూపిన మార్గంలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్బంగా సూచించారు.

జాతి పిత మహాత్మా గాంధి జయంతి సందర్బంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్క్ లో గల జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ శాసన సభ్యులు శ్రీ మెతుకు ఆనంద్, చేవెళ్ల శాసన సభ్యులు శ్రీ కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ శ్రీమతి నిఖిల, మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ కమీషనర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post