వికారాబాద్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

జిల్లా స్థాయి బతుకమ్మ సంబరాలు ఈరోజు స్థానిక బ్లాక్ గ్రౌండ్స్ లో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున మహిళలు తరలివచ్చి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా పరిషద్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, ఎంపీపీ చంద్రకళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ ఆడి పాడారు.

ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ అడపడుచుల పండగ బతుకమ్మ పండగ అని, ఈ పండగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసిందన్నారు.

జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించి సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందమైన పూలలో బతుకమ్మను పేర్చి అందులో గౌరమ్మను ఉంచి భక్తి శ్రద్దాలతో వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలందరికి దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు DRDO కృష్ణన్, మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, డీటీడీఓ కోటాజి, DSCDO మల్లేశం, DWO లలితాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post