వికారాబాద్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా 318 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక కోటి 8 లక్షల బతుకమ్మ చీరల పంపిణికి ఈరోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలియజేసారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారు చేయడం జరిగిందన్నారు. గత ఏడాది పంపిణీ సందర్బంగా మహిళల నుంచి వారి అభిప్రాయాలను సేకరించిన మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈసారి సరికొత్తగా 17 డిజైన్లతో చీరలను సరికొత్తగా రూపొందించడం జరిగిందన్నారు. దాదాపు 16 వేల మగ్గాలపై 10 వేల నేత కుటుంబాలు 06 నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేయడం జరిగిందన్నారు. మహిళలకు ముఖ్యమంత్రి ఇస్తున్న చిరు కానుక తయారీలో నేతన్న పడ్డ కష్టాన్ని మరువద్దని మంత్రి మహిళలను కోరారు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 3లక్షల 29 వేల 624 చీరలు 588 సెంటర్ ల ద్వార చీరాల పంపిణీ కార్యక్రమం ఈరోజు నుండి నిర్వహించడం జరిగితుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఒక అన్నగా చీరలు అందించిన వ్యక్తి మన కేసీఆర్ అని అన్నారు. గిన్నిస్ బుక్ లో బతుకమ్మ పండుగ ఎక్కిందంటే అంతా ప్రభుత్వ కృషి అన్నారు. బతుకమ్మకు దేశంలోనే లేకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడానికి కెసిఆర్ ప్రభుత్వమే అన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి అడబిడ్డల కష్టాన్ని తగ్గించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యావత్ మహిళ లోకం తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా మహిళలందరికి ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సునీత రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, వికారాబాద్ / చేవెళ్ల శాసనసభ్యులు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, మున్సిపల్ చైర్మన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ద దీప, జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్యలు తదితరులు పాల్గొన్నారు

Share This Post