పత్రిక ప్రకటన వికారాబాద్ జిల్లా
తేది :- 06.08.2021.
రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు, రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ పంట కొనుగోలు,24 గంటల విద్యుత్, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతూ, రైతు భీమా లాంటి అనేక పథకాలతో తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం నడుస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. దారూర్ మండలం లో రైతు వేదికలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలలో మంత్రి మాట్లాడారు.రాష్ట్రంలో 80 శాతానికి పైగా ఉన్న రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీత తీయటంతో నేడు అవి జలకళ సంతరించుకున్నాయన్నారు.వాటి కింద సుమారు 30 లక్షల బోర్లలో నీరు వచ్చిందని,తద్వారా 50 లక్షల ఎకరాలలో పంట సాగు జరుగుతుందన్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతి పెద్దది అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి, 7 నుండి 8 ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తో మిగిలిన ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు సాగునీరు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తుందన్నారు. రైతుల కోసం అతి తక్కువ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికలు నిర్మించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఒక్కో రైతు వేదికను 22 లక్షల తో క్లస్టర్ కు ఒకటి చొప్పున నిర్మించి, ఫర్నీచర్ కోసం అదనంగా లక్ష రూపాయలు మంజూరు చేశామన్నారు. ఈ వేదికల వద్ద
ఏ ఈ ఓ లు అందుబాటులో ఉండి రైతన్నలకు సలహాలు,సూచనలు ఇస్తారని,శాస్త్రవేత్తల నుండి కూడా వివిధ సమస్యలకు పరిష్కారం పొందవచ్చన్నారు.ఇలాంటి రైతు వేదికలు దేశంలో ఎక్కడ లేవన్నారు. గతంలో 7 గంటల కరెంట్ కోసం నానా తిప్పలు పడే స్థాయి నుండి నేడు 24 గంటల ఉచిత విద్యుత్ తో రైతులు తమ వీలును బట్టి వ్యవసాయం చేసుకునేలా, అవకాశం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. అటు చినుకులు పడుతుంటే ఇటు రైతుల అకౌంట్ లలో పంట పెట్టుబడి కింద డబ్బులు పడుతుంటాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఏటా 14,800 కోట్లు రైతు బంధు సహాయం అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని మంత్రి సబితా రెడ్డి గారు అన్నారు. ఎలాంటి పైరవి లేకుండా, ఒక్క దరఖాస్తు లేకుండా, అందరికి ఈ సహాయం అందుతుందన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 35 వేల కోట్లు రైతు బంధు కింద రైతన్నలకు సహాయంగా అందించటం జరిగిందన్నారు.కుటుంభ పెద్దగా ఉండే రైతు చనిపోతే 5 లక్షల రైతు భీమా అందిస్తున్నామన్నారు.దీని కోసం ప్రతి ఏటా 1200 కోట్లు రైతుల తరుపున భీమా కంపెనీలకు ప్రీమియంగా కడుతున్నట్లు మంత్రి తెలిపారు. సాధించుకున్న తెలంగాణను ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తూ, దేశంలో నే అగ్రగామిగా నిలుపటానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలు అటు కేంద్రం నుండి మొదలు పెడితే,పలు రాష్టాల వరకు అమలు చేస్తున్నాయన్నారు. 50 వేల రూపాయల రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి గారు అదేశించారని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల 50 వేల మంది రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. తాండూరు కందికి మంచి డిమాండ్ ఉందని, మన పత్తికి కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాగా తెలంగాణ ముందుకెళ్తుందన్నారు. గొల్ల కురుమ యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ, ముదిరాజ్ మృత్సకారులకు చెరువుల్లో చేపలు వదలడం, వాటి అమ్మకం కోసం ఔట్ లెట్ కేంద్రాలు, మొబైల్ వాహనాలు,ప్రభుత్వం అందజేస్తుందన్నారు.అదేవిధంగా రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విధ్యుత్ అందిస్తున్నట్లు,దీని కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాలలో అభివృద్ధి కొసం ప్రతి నెల గ్రామాలకు నిధులు విడుదల చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభత్వనిదే అన్నారు. మున్నూరు సోమారం గ్రామంలో రేషన్ కార్డులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్, MLC సురభి వానిదేవి, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా విద్యాధికారి రేణుకదేవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఎంపీపీ విజయ లక్ష్మీ హన్మంత్ రెడ్డి, జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి గారు,సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు,మార్కెట్ చైర్మన్ రాములు గారు,సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, అధికారులు పాల్గొన్నారు.
≠==============================DPRO/VKB.