వికారాబాద్ జిల్లాలో వాయిదా పడిన (06) మద్యం దుకాణములకు ఈరోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్దతిన ఎంపిక.

జిల్లాలో ఈనెల 20న నిర్వహించిన మద్యం దుకాణాల డ్రాలలో దరఖాస్తులు తక్కువగా వచ్చినందున నేటికి వాయిదా పడిన తాండూర్ సర్కిల్ లోని (06) మద్యం దుకాణములకు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ నిఖిల ఆధ్వర్యంలో లాటరీ పద్దతిన డ్రాలు నిర్వహించి మద్యం దుకాణదారులను ఎంపిక చేయడం జరిగినది.
ముందుగా యాలాల పట్టణంలోని షాపు నెంబర్ 17 SC రేజర్వ్ కు 22 మంది దరఖాస్తు చేసుకోగా డ్రా ద్వారా తలారి శ్రీనివాస్ కు దుకాణం లభించింది. అలాగే కొడంగల్ పరిధిలోని 03 షాపులు జనరల్ కు షాపు నం. 52 ను (16) మందిలో అశోక్ గౌడ్, షాప్ నం. 53 (17) మందిలో
G. హనుమాగౌడ్, షాప్ నం. 54 ను (18) మందిలో N. శరత్ కుమార్ గౌడ్ డ్రా ద్వారా కైవసం చేసుకున్నారు.
అలాగే రావులపల్లి షాపు నం. 55 ను (19) మంది దరఖాస్తు చేసుకోగా హరిజన పెంటయ్యకు,
దౌల్తాబాద్ షాపు నం.56 ను ( 28) మందిలో సుధారాణికి మద్యం దుకాణములను డ్రా ద్వారా కేటాయించడం జరిగింది.
ఈరోజు నిర్వహించిన మొత్తం 06 మద్యం దుకాణములకు 120 దరఖాస్తులు వచ్చాయని, జిల్లాలో మొత్తం 59 మద్యం దుకాణములకు డ్రా ద్వారా కేటాయించడం జరిగిందని, ఇట్టి దుకాణములు డిసెంబర్, 1 నుండి ప్రారంభం కావాలని కలెక్టర్ నిఖిల తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, సీఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post