వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని, ప్రతిజ్ఞ నిర్వహించిన జిల్లా కలెక్టర్ నిఖిల

డా. బి. ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన రచించిన భారత రాజ్యాంగాన్ని 26 నవంబర్, 1949 రోజున ఆమోదించడం జరిగిందని ఇట్టి రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకొవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలియజేసినారు.
ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు వారి సిబ్బందితో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నిఖిల డా. బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధికారులు, సిబ్బందితో “రాజ్యాంగం”ప్రతిజ్ఞ గావించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డా. బి ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల కాల వ్యవధిలో పూర్తి చేయడం జరిగిందని, సమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ 26, నవంబర్,1949 న ఆమోదించబడిందన్నారు. ఈ రోజును ప్రతి యేటా భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాడం జరుగుతుందన్నారు.భారత రాజ్యాంగం 26, జనవరి 1950 నుండి అమలులోకి రావడం జరిగిందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా అధికారులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post