వికారాబాద్ జిల్లా, కోట్ పల్లి ప్రాజెక్ట్ లో చేపపిల్లలను వదులుతున్న విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

వికారాబాద్ జిల్లా :- కుల వృత్తులను బలోపేతం చేయటానికి, వారు ఆర్థికంగా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం చేపలు, గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి తెలియజేసినారు.

ఈరోజు వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని కోటపల్లి ప్రాజెక్టులో వంద శాంతం సబ్సిడీపై ఒక లక్ష చేపపిల్లలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రాజెక్టులో విడుదల చేయడం జరిగినది.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చేపలు, గొర్రెల పంపిణీ తో ఆయా కుల వృత్తుల వారికి అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. గతంలో చేపల కోసం ఆంధ్ర మీద ఆధార పడే వాళ్ళం,నేడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణలో మృత్స సంపద పెరిగిందన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు అన్ని జల కల సంతరించుకున్నాయని వాటిలో చేప పిల్లలను వదిలి సొసైటీ సభ్యులకు ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తితో దాని కింద ఉన్న చెరువులు నింపడం జరిగిందని అట్టి చెరువులలో ఉచితంగా చేప పిల్లలు వదిలి ముదిరాజులకు కూడా ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు.
2016 వ సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెరువులను జియో ట్యాగింగ్ చేయటం జరిగిందని చేప పిల్లల కౌంటింగ్, నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఔట్ లెట్ల ఏర్పాటు చేసి, తెలంగాణ బ్రాండ్ పేరుతో చేపల విక్రయాలు, చేపల వంటకాలు అందుబాటులో కి వచ్చాయని తెలిపారు. జిల్లాలోని తాండూర్, వికారాబాద్, ధరూర్ లలో కూడా చేపల విక్రయాలు నిర్వహించెందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి ఆదేశించారు. బెస్త, ముదిరాజ్, మృత్సకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని త్వరలో కోటపల్లిలో టూరిజం బోట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్లుగా 208 కోట్ల రూపాయల పై చిలుకు నిధులను ఖర్చు చేస్తే, 30 వేల కోట్ల ఆదాయం వచ్చిందని తెలియజేసినారు.15 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి జరిగిందన్నారు. జిల్లాలో 447 మందికి కోటి 40 లక్షల రుణాలు ఇవ్వటం జరిగిందని తెలియజేసినారు.
వికారాబాద్ జిల్లాలో 105 మృత్స పారిశ్రామిక సహకార సంఘాలు వాటిలో 4429 మంది సభ్యులు 775 చెరువులు ఉన్నాయని తెలియజేసినారు.
ప్రస్తుత సంవత్సరం కోటి 14 లక్షలు చిన్న సైజ్ చేప పిల్లలు,25 లక్షల పెద్ద సైజ్ చేప పిల్లలను 775 చెరువుల్లో వదలడం జరుగుతుందని, కోట్ పల్లిలో ఒక లక్ష చేప పిల్లలను ఈ రోజు వదలనున్నామని, మరో 9 లక్షలు విడతల వారిగా వేయనున్నట్లు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల శాసన సభ్యులు మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి, కాలే యాదయ్య లతో పాటు జిల్లా కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ చంద్రయ్య, rdo ఉపేందర్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post