వికారాబాద్ జిల్లా మదనపల్లి గ్రామంలో వైకుంఠదామం మరియు డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

పత్రిక ప్రకటన, తేది:- 09.08.2021.
వికారాబాద్ జిల్లా :- వికారాబాద్ మండలం, మదనపల్లి గ్రామంలో నేటి వరకు అసంపూర్తిగా ఉన్న వైకుంఠదామం నిర్మాణపు పనులను ఈరోజు జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలియున్న పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెయింటింగ్, ఆర్చి, నేమ్ బోర్డు పనులను పూర్తి చేసి వైకుంఠధమాన్ని త్వరగా వినియోగంలోకి తీసుకోరావాలని సూచించారు. ప్రక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ ను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో గల 525 గృహల నుండి ప్రతిరోజు విడివిడిగా తడి, పొడి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. నిర్మించిన డంపింగ్ యార్డ్ లలో చెత్తను వేరుగా చేసి ఎరువుల తయారీ, నిరూపయోగ వస్తువులను విక్రయించి గ్రామ పంచాయతీకి ఆదాయం సమాకూర్చాలన్నారు.
అనంతరం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. కొన్ని మొక్కలు ఎండిపోవడం చూసి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటి ప్రతిరోజు నీరు పోయాలన్నారు. గ్రామంలో ఇంకా ఖాళీగా ఉన్న ప్రదేశాలలో మొక్కలు నాటాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుభాషిణి, PR EE చాణక్య రెడ్డి, ఎంపీవో నాగరాజు, గ్రామ కార్యదర్శి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share This Post