*విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య*

*విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య*

జనగామ, అక్టోబర్ 14: విజయదశమి (దసరా) పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరికి అన్నింటా శుభం చేకూరాలని ఆయన అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, ఎప్పటికైనా మంచిదే అంతిమ విజయమని మానవాళికి చాటి చెప్పిందని ఆయన తెలిపారు. దసరా పండుగలో మన సాంప్రదాయం, సంస్కృతితో పాటూ ఆత్మీయత ఉందని, ఈ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అభివృద్ధి దిశగా జిల్లా పయనించాలని, సమగ్రాభివృద్ధి సాధించాలని ఈ పర్వదినాన ఆ దుర్గ అమ్మవారిని వేడుకుంటున్నానన్నారు. కరోనా మహమ్మారి ఇంకనూ రూపుమాపలేదని, మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నియంత్రణా చర్యల్ని పాటిస్తూ పండుగ జరుపుకోవాలని కలెక్టర్ కోరారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post