విజయవంతంగా పాఠశాలల విద్యార్థిని, విద్యార్ధుల క్రీడా పోటీలు….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -19:

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాఠశాలల విద్యార్థిని, విద్యార్ధులకు నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించు కున్నామని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.

శుక్రవారం సాయంత్రం ఎన్.టి.ఆర్.స్టేడియం లో విద్యా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థిని, విద్యార్ధులకు నిర్వహించిన క్రీడా పోటీల బహుమతి ప్రధానోత్సవంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్రీడా పోటీలలో పాల్గొని గెలిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ ప్రధానం చేశారు.

ఈ బహుమతి ప్రధాన కార్యక్రమంలో డి.ఈ. ఓ. అబ్దుల్ హై, పాఠశాలల ప్రధాన ఉపాద్యాయులు, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, డి.వై.ఎస్. ఓ. అనిల్, తదితరులు పాల్గొననున్నారు.

Share This Post