విజయవంతంగా సామూహిక జాతీయ గీతాలాపన…..

విజయవంతంగా సామూహిక జాతీయ గీతాలాపన…..

విజయవంతంగా సామూహిక జాతీయ గీతాలాపన…..

మహబూబాబాద్, ఆగస్ట్- 16:

మంగళవారం ఉదయం 11-30 గంటలకు జిలా కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పి చైర్ పర్సన్ అంగోతు బిందు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లతో కలిసి పాల్గొని జాతీయ గీతాలాపన చేసారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో రెండు వారాలపాటు వజ్రోత్సవాలను రోజుకొక కార్యక్రమం చేపట్టి ఘనంగా నిర్వహించాలని తెలిపారని, అధికారులు, ప్రజలు మమేకమై స్వాతంత్య్ర ఉద్యమం చేసిన మహనీయులను స్మరించుకొంటూ ఆ స్ఫూర్తిని యువతలో, ప్రజల్లో తీసుకెళ్లి భావితరాలకు స్వాతంత్య్ర ఫలాలు అందించడానికి కృషిలో భాగంగా 15 రోజుల ఈ కార్యక్రమంలో 75 ఏళ్లు పూర్తి చేసుకొని సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నామని, ఈ రోజు నిర్వహించుకున్న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో వేలాదిగా విద్యార్ధులు, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎమ్మెల్యే, మునిసిపల్ చైర్మన్ పాల్గొన్నారని, ఈ స్పూర్తిని కొనసాగించాలని, ఆ రోజు ఎవరికి వారు మాకెందుకు అనుకుంటే స్వాతంత్య్రం వచ్చేది కాదని, పరాయి దేశస్తుల పాలనలో మనం ఉండొద్దు, మన సొంత గడ్డమీద మనమే స్వయంగా ఈ దేశాన్ని పరిపాలించుకోవాలని, తద్వారా పేదలకు, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరుగుతుందని చెప్పి మహాత్మాగాంధీ లాంటి వాళ్లు త్యాగాలు చేసి కుటుంబాలను త్యజించి మరి ఈ దేశాన్ని స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చారని, ఆ స్పూర్తితోనే ముఖ్యమంత్రి ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణను సాధించుకున్నారని, 8 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని, దీనిని కొనసాగించే క్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండి ఈ జిల్లాను, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయుటకు కంకణబద్ధులై మరొక్కసారి పునరంకిత మవుదామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, ఆర్డిఓ కొమురయ్య, ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాలాపన చేశారు.

Share This Post