విజయానికి ప్రతీకగా నిలిచిన దసరా… జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హరీష్

విజయానికి ప్రతీకగా నిలిచిన దసరా…

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్​ హరీష్​

దసరా పండగ విజయానికి ప్రతీకగా నిలిచిందని ఎల్లప్పుడూ మంచికే విజయం వరిస్తుందనడానికి విజయదశమి పండగ నిదర్శనమని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీష్​ అన్నారు. శుక్రవారం విజయదశమి (దసరా) పండగను పురస్కరించుకొని జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్​ హరీష్​ మాట్లాడుతూ పురాణాల ప్రకారం పాండవులు మంచి కోసం వనవాసం చేసిన తర్వాత జమ్మిచెట్టుపై దాచి ఉంచిన ధనస్సు వంటి అస్త్రాలను తీసుకెళ్ళి కౌరవులతో యుద్దం సాధించారని దీంతోనే విజయదశమి పండగ జరుపుకొంటారని అన్నారు. ప్రతి ఒక్కరు మంచి మార్గంలో పయనించినట్లయితే విజయం వారిని తప్పకుండా వరిస్తుందనే విషయాన్ని గుర్తించాలని కలెక్టర్​ హరీష్​ కోరారు. ఈ సందర్భంగా మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా ప్రజలతో పాటు ఆయా శాఖల అధికారులు, నాయకులు,  విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post