విజయ పాలు, పాల ఉత్పత్తులను మరింత గా పెంచేందుకు ఐస్ క్రీం ఫుష్ కార్ట్ (ట్రై సైకిల్) లను రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం సబ్సిడీ పై అర్హులైన వారిని గుర్తించి అందించాలని, తద్వారా నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డీ ఫ్రీజర్ లను 50 శాతం సబ్సిడీ పై ఇవ్వడం ద్వారా డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలలో అభివృద్ధి కనిపిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

విజయ పాలు, పాల ఉత్పత్తులను మరింత గా పెంచేందుకు ఐస్ క్రీం  ఫుష్ కార్ట్ (ట్రై సైకిల్) లను రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం సబ్సిడీ పై అర్హులైన వారిని గుర్తించి అందించాలని, తద్వారా నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డీ ఫ్రీజర్ లను 50 శాతం సబ్సిడీ పై ఇవ్వడం ద్వారా డెయిరీ ఉత్పత్తుల అమ్మకాలలో అభివృద్ధి కనిపిస్తుందని  రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో విజయ తెలంగాణ బోర్డు 14 వ సమావేశం చైర్మన్ లోక భూమారెడ్డి అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, విజయ డెయిరీ MD అనిత రాజేంద్ర, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, GM కామేష్, మార్కెటింగ్ GM మల్లికార్జున్ లు పాల్గొన్నారు. విజయ దేయిరీకి ఇప్పటికే పాలు పోసే రైతులను ప్రోత్సహించే విధంగా లీటర్ పాలకు 4 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తున్నదని, దీనికి అదనంగా పాడి రైతుల పిల్లల ను విద్యలో ప్రోత్సహించే విధంగా విద్యాకానుక, ఆడబిడ్డ పెండ్లికి ఆర్ధిక సహాయం అందించే పెండ్లి కానుక క్రింద 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం, సబ్సిడీ పై దాణా సరఫరా, పాడి నిర్వహణ లో శిక్షణ కార్యక్రమాలు, ఉచిత పశువైద్య శిభిరాలు, పాడి పశువు కొనుగోలుకు ఆర్ధిక సహాయం, నాణ్యత కలిగిన పాలు అందించిన మిల్క్ షెడ్ లకు అవార్డులు వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాలను పాల సేకరణ కేంద్రాల వద్ద, గ్రామపంచాయితీ కార్యాలయాలలో పోస్టర్ల ద్వారా, రైతు అవగాహన శిభిరాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి పశువులకు ఉచితంగా వైద్యసేవలు, TSLDA ద్వారా మేలుజాతి పశుసంపద అభివృద్దికి చేస్తున్న కృషి, ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి  విజయ డెయిరీ కే పాలు పోసే విధంగా చూడాలని మంత్రి సూచించారు. గ్రామాలలో పాడి రైతులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే గోపాలమిత్ర ల సేవలను కూడా వినియోగించుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ డెయిరీ అధికారులకు సూచించారు. పాడి రైతులకు ప్రతి 7 రోజులకు ఒకసారి సకాలంలో పాల బిల్లును చెల్లించాలని సమావేశం తీర్మానించింది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల లో నూతన మెగా డెయిరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 5 లక్షల లీటర్ల పాల సామర్ధ్యం, 2.5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తుల తయారీ కలుపుకొని మొత్తం 7.5 లక్షల లీటర్ల సామర్ధ్యంతో నిర్మించనున్న మెగా డెయిరీ కి అవసరమైన పాల సేకరణ కు పూర్తిస్థాయి ప్రణాళికలను ఇప్పటి నుండే రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు గాను అధికారులకు  పాల సేకరణ పై నిర్దిష్టమైన లక్ష్యాలను ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాల సేకరణ, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. విజయ పాలు, పాల ఉత్పత్తులకు ఎంతో ప్రజాధరణ ఉందని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరిన్ని నూతన ఔట్ లెట్ లను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధాన పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని, సమ్మక్క సారక్క, కొమురెల్లి జాతర వంటి ప్రధాన జాతర లలో తాత్కాలిక ఔట్ లెట్ లను ఏర్పాటు చేసి విజయ డెయిరీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని అన్నారు. కొన్ని ప్రాంతాలలో విజయ డెయిరీ ఔట్ లెట్ లలో ఇతర సంస్థలకు చెందిన ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు పిర్యాదులు వస్తున్నాయని, విజయ ఉత్పత్తులు తప్ప ఇతర డెయిరీ లకు చెందిన ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Share This Post