విత్తన, ఎరువుల డీలర్లు తమ షాపులలో అన్ని రకాల రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి డీలర్లకు సూచించారు.

గురువారం నాడు భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామం రైతు వేదిక భవనంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా లోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్  ఈ సందర్భంగా మాట్లాడుతూ,  ప్రతి డీలర్ తప్పకుండా తమ షాపులో  కనిపించే విధంగా లైసెన్స్ ప్రదర్శించాలని,  స్టాక్ బోర్డు, అన్ని రకాల రిజిస్టర్లను తూచా తప్పకుండా నిర్వహించాలని తెలిపారు.  రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తూ విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.  ప్రతి రైతు తప్పకుండా పట్టాదారు,  ఆధార్ జిరాక్స్ ప్రతులతో ఎరువులు కొనుగోలు చేసేలా  రైతులకు సూచించాలని తెలిపారు.
శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ, సహాయ సంచాలకులు డి. వెంకటేశ్వరరావు,  డి.పద్మావతి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించిన చట్టాలను వాటిని అమలు పరిచే విధానాలను, ఇ పాస్ మిషన్ లో ఎరువుల నమోదు,  తీసుకోవాల్సిన జాగ్రత్తలను  వివరంగా తెలియజేయడం జరిగింది.
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికార్లు, డీలర్లు పాల్గొన్నారు.

Share This Post