విదేశాలకు ఉత్పత్తుల ఎగుమతులలో సహకారం అందిస్తాం…

ప్రచురణార్థం

విదేశాలకు ఉత్పత్తుల ఎగుమతులలో సహకారం అందిస్తాం…

మహబూబాబాద్ సెప్టెంబర్ 25.

రైతులు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడంలో సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

శనివారం కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తుల ఎగుమతులపై సంబంధిత రైతులు పారిశ్రామికవేత్తలు తో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిర్చి పసుపు మామిడి ఆర్గానిక్ రైస్ వంటి తదితర ఉత్పత్తులు ఎగుమతిలో విదేశ స్థాయికి చేరుకున్నందున రైతులకు తగిన ప్రోత్సాహం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాలో రైతులకు సహకారం అందించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ఎగుమతులలో ఇబ్బందులు తొలగనున్నాయని అన్నారు.

పరిశ్రమలు నెలకొల్పు కునేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం అన్నారు అదేవిధంగా ఉత్పత్తులను నాణ్యతతో ఎగుమతి చేసేలా శిక్షణా కార్యక్రమాలు కూడా చేపడతామని రైతులు కూడా తమ ఉత్పత్తులు నాణ్యమైనవి చేపట్టాలని కోరారు.

ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా పరిశ్రమల అధికారి సత్యనారాయణ, ఉద్యాన అధికారి సూర్యనారాయణ, రైతులు జైపాల్ రెడ్డి, నేతాజీ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
—————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post