విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు “అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం” అందించే సదుపాయాలను సధ్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.

విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే షెడ్యూల్డ్  కులాల విద్యార్థులు  “అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం” అందించే సదుపాయాలను సధ్వినియోగం  చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.

శుక్రవారం జిల్లా షెడ్యూల్డ్  కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో షెడ్యూల్ కులాల విద్యార్థుల  అభివృద్ధి కొరకు రాష్ట ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  మెడిసిన్, ఇంజనీరింగ్ , ఫార్మసీ, నర్సింగ్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ స్టడీస్ లాంటి పి.జి. కోర్స్ లు చేయాలనుకునే వారు ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని అన్నారు. ఈ పథకం కింద ఎంపిక అయిన విద్యార్థులకు  రూ.20 లక్షల ఆర్ధిక సహాయం  2 విడతలుగా మంజూరు అవుతుందని, అన్ని ధ్రువ పత్రాలు సమర్పించిన వారికి మొదటి విడతలో రూ.10 లక్షలు, రెండవ సెమిస్టరు ఫలితాల ఆధారంగా 2 వ విడత లో రూ.10 లక్షలు మంజూరు అవుతాయని  తెలిపారు. పూర్తి వీసా ఫిజు మరియు విమాన ప్రయాణ చార్జిలు (రూ.50,000 లోపు) కుడా ఈ పథకం ద్వారా పొందవచ్చని తెలిపారు. ఈ పథకం కుటుంబం లో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందని, కుటుంబ ఆర్ధిక ఆదాయం రూ.5 లక్షలు, డిగ్రీ లో కనీసం 60% మార్కులు , GRE,GMAT, TOEFL, IELTS, అర్హత పరిక్షలలో 60% మార్కులు, ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం లో దరకాస్తు చేసుకోవాలనే వారు  Epass portal : telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చని, లేదా ధరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్  కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం లో సమర్పించవచ్చని తెలిపారు.  GRE,GMAT, TOEFL, IELTS, అర్హత పరీక్షలకు పేరొందిన కోచింగ్ సంస్థల ద్వారా వారికి కోచింగ్ అందించడం జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం జిల్లా షెడ్యూల్డ్  కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం లో  సంప్రధించాలని తెలిపారు.

కార్యక్రమం లో జిల్లా షెడ్యూల్డ్  కులాల  అభివృద్ధి అధికారిణి శ్వేత, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయడమైనది.

Share This Post