విదేశాల్లోని ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.జిల్లా ఉపాధి కల్పన అధికారి రామకృష్ణ .

ప్రచురణార్థం

.

మహబూబాబాద్ నవంబర్ 28.

విదేశాల్లోని ప్రభుత్వ రంగ సంస్థ లలో ఉద్యోగాలు చేయాలనే ఆసక్తి ఉన్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు దరఖాస్తులను అందించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి రామకృష్ణ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాదులోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ద్వారా జపాన్ యూరప్ గల్ఫ్ వంటి దేశాలలో నర్సింగ్ కేర్, కేర్ టేకర్ వంటి ఉద్యో గాలలో తగిన అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెలాఖరులోగా www.tomcom.telangana.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని అందుకు సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ కోర్సును డిసెంబర్ నెలలో ఆరంభించనున్నందున అర్హత గల అభ్యర్థులు తక్షణమే రిజిస్టర్ చేసుకోవాలని ఉపాధి కల్పనాధికారి తెలియజేశారు. ఇతర వివరాలకు 9100798204, 9908830438 ల ద్వారా సంప్రదించవచ్చునన్నారు.

Share This Post