విద్యపై ఆసక్తిని పెంచి మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరమునందు 23 మండలాల క్లస్టర్ నోడల్ అధికారులతో తొలి మెట్టు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలోని వెనుకబడిన విద్యార్థులకు చదువులపై ఆసక్తిని పెంచి మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఒక పాఠశాల యొక్క నాణ్యత పాఠశాలలోని వెనకబడిన విద్యార్థి యొక్క స్థాయి ఆధారంగా తీసుకున్నట్లయితే విద్యాబోధన ఏ మేరకు మెరుగుపరచుకోవాలో తెలుస్తుందని కలెక్టర్ చెప్పారు. పాఠశాలల్లో ఉన్న వెనకబడిన విద్యార్థులను మెరుగైన విద్యను అందించి వారిని ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్లటమే తొలి మెట్టు యొక్క ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యాబోధనలో ఉపాధ్యాయునికి ఓర్పు, శక్తి ,యుక్తి ఎంత అవసరమో కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా తొలిమెట్టు లక్ష్యాలను నెరవేరడంలో పర్యవేక్షణ అధికారుల ప్రాధాన్యతను కలెక్టర్ తెలిపారు. సంఖ్య జ్ఞానం ప్రతి విద్యార్థికి అందించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని మండల విద్యాధికారులు, మండల నోడల్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ అన్నారు. పాఠశాలలకు విద్యార్థుల హాజరు, తల్లిదండ్రుల భాగస్వామ్యం, బహుళ తరగతి బోధనలలో ఎదురయ్యే సవాళ్లు బోధన, అభ్యసన ప్రక్రియను విజయవంతం చేయడం కొరకు తొలిమెట్టు శిక్షణలో నేర్పించిన అంశాలపై స్పష్టత ,సామర్థ్యాలను పాటించవలసిన వ్యూహాలను ఉపయోగించవలసిన బోధన అభ్యసన పరికరాలు, పిరియడ్స్ ప్రకారం బోధన ప్రక్రియ పలు అంశాలపై చర్చించి కలెక్టర్ సమీక్షించడం జరిగింది. 23 మండలాల క్లస్టర్ నోడల్ అధికారులు పాఠశాలలను సందర్శించినప్పుడు గమనించిన విషయాలను సమస్యలను వాటి పరిష్కారాలను, సలహాలను సూచనలను నోడల్ అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ కు తెలిపారు . పాఠశాలలోని ప్రతి విద్యార్థి భాషలో చదవగలగాలి, చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి, దానిని వారు రాయగలగాలి, ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు వ్రాసే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో సూర్యాపేట జిల్లాలో మొదటి స్థానంలో ఉంచడానికి ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ కే అశోక్ ,ఎంఈ ఓ జనార్దన్ ,సీఎంవో రాంబాబు, ఎం ఈ ఓ లు, ప్రధానోపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
—————————————-‐——
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సూర్యపేట వారిచే జారీ చేయనైనది