విద్యపై ఆసక్తి పెంచడం ద్వారానే హాజరు శాతం పెరుగుతుంది..జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం

విద్యపై ఆసక్తి పెంచడం ద్వారానే హాజరు శాతం పెరుగుతుంది…

కురవి
మహబూబాబాద్, సెప్టెంబర్ 3.

విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెంచడంతోనే హాజరు శాతం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

శుక్రవారం జిల్లాలోని కురవి మండలంలో పర్యటించి మోదుగుల గూడెం, కాంపల్లి హైస్కూల్లో తరగతి గదులను మరుగుదొడ్లను మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు.

ముందుగా తరగతి గదులను సందర్శించి విద్యా బోధన పరిశీలించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి వారి ప్రతిభను పరీక్షించారు.
విద్యపై ఇష్టత పెంచుకోవడంతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చునన్నారు.

లక్ష్యాలను చిన్నతనం నుండే ఏర్పరచుకొని విజయాలను సాధించాలన్నారు. విద్యలో నిరంతర సాధన విజయ పధంలో నిలబెడుతుందన్నారు.

పాఠశాల నిర్వహణ తీరును పరిశీలిస్తూ ఉపాధిహామీ పథకం ద్వారా పాఠశాల ఆవరణ చదును చేయించాలని, బ్రష్ వుడ్ తో పాఠశాల ఆవరణలోకి జంతువులు ప్రవేశించకుండా కాంపౌండ్ ను బ్రష్ వుడ్ చేపట్టి పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

నూరు హాజరు శాతం విద్యార్థులు హాజరు అయ్యే విధంగా ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని, విద్యార్థులు కూడా తమ తోటి విద్యార్థులకు కోవిడ్ తో సంవత్సర కాలంగా నష్టపోయిన విధానాన్ని తెలియజెప్పాలన్నారు.

మరుగుదొడ్లు నిర్వహణ, పాఠశాల ఆవరణ చదును, మధ్యహన్న భోజనం అమలు తీరుతెన్నులను స్వయంగా సందర్శించి పరిశీలించారు.

ఈ.జి.ఎస్.నిధులతో పాఠశాల ఆవరణ శుభ్ర పరచాలని, కాంపౌండ్ లేనిచోట బ్రష్ వుడ్ తో చేపట్టాలన్నారు.

విద్యార్థులు చెట్ల క్రింద కూర్చోబెట్టినప్పుడు టార్పాల్స్ వేయించాలన్నారు.లేనిచో వరండాలో కూర్చోబెట్టాలని ఆదేశించారు.

మీను ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని సూచించారు. విద్యార్థులు, ఉపాద్యాయులు అందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

పాఠశాలల్లో 100శాతం విద్యార్థులు నమోదు కావాలని, ప్రజాప్రతినిధులు సహకారం తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, మోదుగుల గూడెం, కాంపల్లి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శంకర్, బిక్షం, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎపిడిఓ ధన్ సింగ్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
———————————–+
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారిచేయనైనది.

Share This Post