విద్యలో రాణించేందుకు పోటీతత్వం పెంపొందించుకోవాలి…

ప్రచురణార్థం

విద్యలో రాణించేందుకు పోటీతత్వం పెంపొందించుకోవాలి…

మహబూబాబాద్ అక్టోబర్ 5.

విద్య లో రాణించేందుకు కృషి పట్టుదల తో పోటీతత్వం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఉద్బోధన చేశారు.

మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల తో పాటు జూనియర్ బాలుర కళాశాల లను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఎం పి హెచ్ డబ్ల్యు తరగతి విద్యార్థులతో మాట్లాడారు. బీఎస్సీ నర్సింగ్ కొరకే ఎం పి హెచ్ డబ్ల్యు తీసుకున్నామని విద్యార్థులు తెలియజేయగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో విద్యకు ప్రాధాన్యత ఏర్పడి నందున సాధారణ మార్కులతో ఉపాధి అవకాశాలు కొరవడే ప్రమాదముందని, పోటీతత్వం లో ఉన్నత స్థానంలో ఉంటేనే తప్ప రాణించలేమని తెలియజేస్తూ నాణ్యమైన విద్యను అభ్యసిస్తూ ఉపాధి రంగానికి బాటలు వేసుకోవాలని అన్నారు. తోటి విద్యార్థులు కూడా కళాశాలకు వచ్చే విధంగా ప్రోత్సహించాలని విద్యార్థులకు తెలియజెప్పారు.

కళాశాల అధ్యాపకులతో నిర్వహణ తీరును పరిశీలించేందుకు తరగతి గదులను కళాశాల ఆవరణ, మరుగుదొడ్ల నిర్వహణ పరిసరాల పరిశుభ్రత వంటివి పరిశీలించారు కళాశాలలను ప్రారంభించే ముందు గానే పరిశుభ్రత పరచుకోవాలని ఆదేశించిన నిబంధనలు పాటించకుండా చెత్త చెదారంతో నిర్వహించడం కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్వహణ తీరు సరిగా లేదని పనితీరు మార్చుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ వీరేందర్ ను హెచ్చరించారు.

కళాశాల భవనం పనుల పై నివేదిక ఇవ్వాలన్నారు.
బాలికల కళాశాలలో ప్రహరి నిర్మాణం పునర్నిర్మించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ జోస్నా రాణి బాలుర కళాశాల ప్రిన్సిపాల్ వీరేందర్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ప్రజలు పాల్గొన్నారు
———————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post