విద్యాబోధనకు పాఠశాలలను సర్వం సిద్ధం చేస్తాం…

ప్రచురణార్థం

విద్యాబోధనకు పాఠశాలలను సర్వం సిద్ధం చేస్తాం…

మహబూబాబాద్ ఆగస్టు 24.

రాష్ట్ర ప్రభుత్వం కోవిద్ 19 ఉధృతి కారణంగా తాత్కాలికంగా మూసివేసిన పాఠశాలను పునః ప్రారంభించే దిశగా విద్యాబోధనకు అన్ని విధాలుగా సౌకర్యాల కల్పనకు తక్షణ చర్యలు తీసుకుంటామని జడ్పీ చైర్మన్ కుమారి ఆంగోతు బిందు తెలిపారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్న దృశ్య రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు జడ్పీ చైర్మన్ ల తో జిల్లా కలెక్టర్లతో మున్సిపల్ చైర్మన్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో విద్య బోధనకు గాను పాఠశాలలను అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

ప్రధానంగా పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశుభ్ర పరిచి పనిచేసే విధంగా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. నీటి కొరత లేకుండా మిషన్ భగీరథ కనెక్షన్ కు చర్యలు తీసుకుంటామన్నారు

అలాగే సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థుల పట్ల కరోనా నిబంధనల మేరకు చేతులను శానిటైజర్ చేయించడం మాస్కులు ధరించే విధంగా సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నివేదిస్తూ గ్రామాలలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతకు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారని మల్టీ పర్పస్ వర్కర్స్ కొరత ఉంటే తక్షణం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు

ప్రతి పాఠశాలకు త్రాగునీరు సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ కనెక్షన్ తోపాటు , విద్యుత్ కనెక్షన్ ఉండేవిధంగా పాఠశాల ఆవరణను పరిశుభ్రపరిచి విద్యాబోధనకు సిద్ధం చేస్తామన్నారు.

పాఠశాలల్లో చెత్తాచెదారం తొలగింప చేస్తామని, అదేవిధంగా పాత సామాన్లు కూడా తొలగిస్తామన్నారు.

విద్యా కమిటీ లను, పేరెంట్స్ కమిటీలను పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటూ పాఠశాల అభివృద్ధికి అవసరాలకు అనుగుణంగా దాతల సహకారం కోరతామన్నారు.

ప్రజా ప్రతినిధులు సహకారంతో విద్యార్థులు నూరు శాతం పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ,మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ కొమరయ్య,జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ, జిల్లా గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు దిలీప్ కుమార్, మహిళ శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా , సోషల్ వెల్ఫేర్ రీజినల్ కో ఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ కృష్ణా రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ తదితరులు పాల్గొన్నారు.
————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post