విద్యార్థినీలు గొప్ప లక్ష్యాలను పెట్టుకోవాలి : జిల్లా అనురాగ్ జయంతి

విద్యార్థినీలు గొప్ప లక్ష్యాలను పెట్టుకోవాలి : జిల్లా అనురాగ్ జయంతి

——————————-
తంగళ్ళపల్లి 21, జూలై 2022
——————————-
విద్యార్థినీలు గొప్ప లక్ష్యాలను పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఫ్యాషన్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్లో  కోర్స్ లకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు.

ఈ కోర్స్ లు పూర్తి చేసి… ఈ రంగాలలో తమదైన ముద్ర వేస్తే అంతర్జాతీయం మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని తెలిపారు.

గురువారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రంలోనీ మొట్టమొదటి ప్రభుత్వం గిరిజన సంక్షేమ గురుకులంలోని ఫైన్ ఆర్ట్స్ విభాగం ను ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో  ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం,ఇంటీరియర్ డిజైన్లో డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థినిలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
వారు వేసిన పేయింటింగ్ లు, ఇంటీరియర్ డిజైన్ లు, తీసిన ఫోటోల ను చూసి అద్భుతంగా వేశారు వెల్ డన్ అంటూ అభినందించారు.

విద్యార్థినిలు గీసిన చిత్రాలు, పేయింటింగ్ లు,
ఇంటీరియర్ డిజైన్ లు తీసిన ఫొటోల తో ఆగస్ట్ లో ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా విద్యార్థుల ప్రతిభ, కళాశాల పని తీరు అందరికీ తెలుస్తుందన్నారు.
అలాగే విద్యార్థినీ లు తీసిన ఫొటోల తో టేబుల్, వాల్ క్యాలెండర్ ను సమాచార పౌర సంబంధాల శాఖ సహకారంతో సిద్ధం చేయాలనీ కళాశాల ప్రిన్సిపాల్ కు సూచించారు.

ఎంబ్రాయిడరీ కోర్స్ చదువుతున్న విద్యార్థిని లను సిరిసిల్ల అపెరల్ పార్క్ లోని గోకుల్ దాస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు క్షేత్ర సందర్శన కోసం తీసుకెళ్లాలని ప్రిన్సిపల్ కు సూచించారు.

ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం,ఇంటీరియర్ డిజైన్ వంటి ఫైన్ ఆర్ట్స్ లలో నిపుణులను కళాశాల కు తెప్పించి సెమినార్ లు నిర్వహించేలా చూస్తామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
అలాగే కోర్స్ లో భాగంగా విద్యార్థినిలను విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేందుకు వీలుగా అవసరమైన సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ నిత్యావసర సరుకులను భద్రపరిచే గదులను , వాటి నిర్వహణ నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కే రజనీ, అధ్యాపకులు కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పనితీరు, ప్రగతిని జిల్లా కలెక్టర్ కు వివరించారు.

Share This Post