విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని, తల్లిదండ్రుల అంగీకారంతో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పూర్తిస్థాయిలో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 01 ఖమ్మం:

విద్యార్థులందరూ తరగతులకు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని, తల్లిదండ్రుల అంగీకారంతో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పూర్తిస్థాయిలో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నేటి నుండి పాఠశాలలు పున: ప్రారంభమైన నేపథ్యంలో ముదిగొండ మండలం లక్ష్మీపురం, చిరుమర్రి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను బుధవారం కలెక్టర్ తణిఖీ చేసారు. మొదటి రోజు తరగతులకు హాజరైన విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పాఠశాల్లో విద్యాబోధన ప్రారంభించబడినదనే విషయాన్ని తల్లిదండ్రులకు అవగాహనపరిచి విద్యార్థులను పాఠశాలలకు తీసుకొని రావాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే విద్యా సంవత్సరం వృధా అయిందని ఇకపై విద్యార్థులకు నిరంతరాయంగా బోధన జరగాలని కలెక్టర్ సూచించారు. లక్ష్మీపురం పాఠశాలలో మధ్యాహ్నభోజన ఏర్పాట్లను కలెక్టర్ తణిఖీ చేసారు. వంటమనుషులందరూ | కోవిడ్ టీకాలు రెండు డోసులు పూర్తి చేసి ఉండాలని, పరిశుభ్రమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా రెండు డోసుల టీకా తీసుకొనియుండాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలకు డిప్యూటేషన్పై కేటాయించిన ఉపాధ్యాయులందరూ ఆయా విద్యా సంస్థలలో తక్షణమే రిపోర్టు చేయాలని, అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల పునః ప్రారంభంరోజునే సెలవుపై వెళ్ళిన ఉపాధ్యాయులు టి కోటేశ్వరరావు నుండి వివరణ పొంది మధ్యాహ్నంలోగా విధులకు హాజరయ్యేలా సత్వర చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని మండల విద్యాశాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు.

చిరుమర్రి గ్రామంలో డెంగ్యూ కేసుల నియంత్రణకై సత్వర చర్యలు చేపట్టాలని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ చర్యలను తల్లిదండ్రులకు వివరించి వందశాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యెలా ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, మండల విద్యాశాఖాధికారి బి. రామాచారీ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి.సాంబశివరావు, ఎస్.కె. నాజర్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post