విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యానందించాలి – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శాంత కుమారి

దేశానికే ఆదర్శం మన పాఠశాలలు – ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యత ఏది? – ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని, బడి పిల్లల భవితకు బంగారు బాటలు వేయాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మ‌న ఊరు-మ‌న బ‌డి, ‘మన బస్తీ-మన బడి’ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టార‌ని నాగర్ కర్నూల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శాంత కుమారి అన్నారు.
బుధ‌వారం వెల్దండ మండల కేంద్రంలో మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మంలో మొదటి విడతలో 26 లక్షల రూపాయలతో చేపట్టిన పనులు పూర్తయిన వెల్దండ యంఆర్సీ ప్రాథమిక పాఠశాలలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శాంత కుమారి, శాసనసభ్యులు గుర్క జైపాల్ యాదవ్, శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి లు ప్రారంభోత్సవం చేశారు.
విద్యార్థులకు ఏర్పాటు చేసిన నూతన ఫర్నిచర్ ను వారు తిలకించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ భూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో దేశంలో మ‌న రాష్ట్రం ముందంజ‌ల్లో ఉంద‌న్నారు. విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.
విద్యకు అధిక ప్రాధాన్య ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆమె వెల్ల‌డించారు.
ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు.
ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు ఓ అరగంట మెడిటేషన్ తో పాటు క్రీడలను నిర్వహించాలన్నారు.
తద్వారా విద్యార్థులకు మేధాశక్తిని పెంపొందుతుందన్నారు.
ఒత్తిడి లేకుండా విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు యోగ ఒక మంచి సాధన అని ప్రతిరోజు విద్యార్థులకు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆమె కోరారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కల్వకుర్తి శాసనసభ్యులు గుర్క జైపాల్ యాదవ్ మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ బడ్జెట్లో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.
మన ఊరు – మన బడి పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289 కోట్లతో 12 రకాల మౌళిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పించేందుకు కృషి చేస్తుంద‌ని తెలిపారు. పాఠశాల విద్యలో విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వసతులు కల్పిస్తుంద‌న్నారు. ఇలా అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతో ఉపాధ్యాయులు కూడా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పాఠాలు బోధించే అవ‌కాశం క‌లిగింద‌న్నారు.
గ్రామాలలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన చేపట్టి, దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుంద‌న్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 1100 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి 6 లక్షల మంది విద్యార్థులకు విద్యనందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.
ఒక్కో విద్యార్థికి ఒక లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ నని కొనియాడారు.
విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో మొద‌టి విడ‌త‌లో రూ. 80.75 కోట్ల‌తో 290 స్కూళ్ళ‌ను ఆధునీకరిస్తున్నామ‌ని, మూడు ద‌శ‌ల్లో అన్ని పాఠ‌శాల‌ల్లో ప‌నులు పూర్తి చేస్తామ‌ని చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మొట్టమొదటిగా వెల్దండ పాఠశాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం లో మొదటి విడతలో భాగంగా 39 కోట్ల రూపాయలతో 107 పాఠశాలలను ఆధునికరించడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తూ బదిలీలు, పదోన్నతులు చేపట్టిందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్యఅతిథి శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ….
మన ఊరు మన బడి పథకం క్రింద – పాఠశాలల్లో పరిశుభ్రమైన త్రాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, మంచి లైటింగ్ సదుపాయం, భోజన వసతి ఏర్పాట్లు, గ్రీన్ బోర్డులు, డిజిటల్ తరగతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పనులతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. విద్యకు అధిక ప్రాధాన్య ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం నేడు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యత లేని విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విమర్శించారు.
పేద ప్రజల అభ్యున్నతికి బడ్జెట్ ఏమాత్రం సహాయ పడేలా లేదని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఈవో మాట్లాడుతూ…..
నాగర్ కర్నూల్ జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభం చేస్తున్న వెల్దండ పాఠశాల అని జిల్లాలో 290 పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి చేపట్టిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో డీఈఓ గోవిందరాజులు, ఆర్ అండ్ బి ఈఈ భాస్కర్, మండల విద్యాధికారి శంకర్ నాయక్, సెక్టోరియల్ అధికారి బరపటి వెంకటయ్య, గ్రామ సర్పంచ్ భూపాల్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ సత్యం, రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సురేందర్ రెడ్డి, పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారులు పాల్గొన్నారు.
………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నాగర్ కర్నూల్ నుండి జారీ చేయడం అయినది.

Share This Post