*ప్రెస్ రిలీజ్*
*ఏప్రిల్ 22*
*హనుమకొండ*
*విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి*
*ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్*
విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,
శుక్రవారం నాడు *వరల్డ్ ఎర్త్ డే*
సంధర్భంగా న్యూ శాయంపేట ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ
ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు చెంది మానవ మనుగడకే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు,
అందుకే ప్రపంచ దేశాలు, వివిధ స్వచ్చంద సంస్థలు అన్ని కలిసి ఈ ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
అందులో భాగంగానే ఈ వారం రోజుల కార్యక్రమాలు నిర్వహించుటకు ఈషా ఫౌండేషన్, తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు ఎంపి సంతోష్ కుమార్, గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తున్నాయని అన్నారు, పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై కనీస అవగాహన కల్పించాలన్నారు.
ప్రకృతి పరిరక్షణ *సేవ్ సాయిల్, సేవ్ ఎర్త్, సేవ్ ఫ్యూచర్* అనే నినాదంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ భూమండలంలో అధిక శాతం సముద్రం ఉందని అందులో కొంత భాగం వ్యవసాయం మీద ఆధారపడి అనేక రసాయన ఎరువులు విత్తనాలతో పంటలు పడేందుకు వాడుతున్నారని, సహజ సిద్ధమైన వనరులు కొండలు, చెరువులు, త్రవ్వడం ద్వారా, ప్లాస్టిక్ వాడకాం ద్వారా, ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు,
*సేవ్ ఎర్త్, సేవ్ సాయిల్, సేవ్ ఫ్యూచర్* అనే ప్రతిజ్ఞ చేయించి, మట్టితో హస్తం గుర్తు వేసి సంతకం చేసారు,
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీ పరీక్షలో నెగ్గిన విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాులు స్వామి, వేదాంతం, కుడా డైరెక్టర్, శివ శంకర్, అనిరుద్, ప్రణతీ, అఖిల, హనుమకొండ ఎంఈఓ, సదానందం, రమేష్, చారి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి* *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్*
