జిల్లాలోని విద్యార్థినీ, విద్యార్థులకు చరిత్ర తెలిసేలా పర్యాటక స్థలాలు సందర్శిoచేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని జైనూర్, ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్ నుండి బస్సులు ఏర్పాటు చేసి కొమురం భీం జోడెఘాట్, ఎన్.టి.ఆర్. సాగర్, కొమురంభీం ప్రాజెక్టులను దర్శించేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నుండి జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవికృష్ణతో కలిసి క్షేత్ర పర్యటనను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు చారిత్రక ప్రదేశాల గుర్తించి పూర్తి అవగాహన కల్పించే విధంగా ఈ పర్యటన ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 178 మంది విద్యార్థులు 24 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారని తెలిపారు. జైనూర్, ఆసిఫాబాద్ నుండి వెళ్ళిన విద్యార్థులకు కొమురంభీం జోడెఘాట్, రెబ్బెన విద్యార్థులకు ఎన్.టి.ఆర్. సాగర్, కాగజ్‌నగర్ విద్యార్థులకు కొమురంభీం ప్రాజెక్టు సందర్శిoపజేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమాలలో ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారి ఉదయ్ బాబు, డి.పి.ఎం. ఏ.రామకృష్ణ, మండల విద్యాధికారులు,
కో-ఆర్డినేటర్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సి. ఆర్..పి.లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.