విద్యార్థులకు తగినట్లుగా వసతిగృహాల్లో సౌకర్యాలు కల్పించాలి…

ప్రచురణార్థం

విద్యార్థులకు తగినట్లుగా వసతిగృహాల్లో సౌకర్యాలు కల్పించాలి…

మహబూబాబాద్ డిసెంబర్ 17.

వసతి గృహాల్లో విద్యార్థుల చేరిక పెరుగుతున్నందున విద్యార్థులకు తగినట్లుగా సౌకర్యాలు కూడా కల్పించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో ఎస్సీ వసతి గృహాల విద్యార్థుల సంఖ్య తో పాటు వసతి సౌకర్యాలు, పోస్ట్ మెట్రిక్, ప్రీమెట్రిక్ కళాశాలల విద్యార్థుల సంఖ్య వసతి సౌకర్యాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 20 పాఠశాలలకు సంబంధించిన హాస్టల్స్ 4 కళాశాలకు సంబంధించిన పోస్టు ప్రీమెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయన్నారు.

20 పాఠశాలలకు సంబంధించిన వసతిగృహాల సౌకర్యాలను సమీక్షిస్తూ షెడ్యూల్ కులాల నిరుపేదల విద్యార్థుల ఉచిత విద్యతో పాటు వసతి కల్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందని సంక్షేమ ఫలాలు విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి చేరుకునే విధంగా అధికారులు కృషి చేయాల్సి ఉందన్నారు.

వసతి గృహ అధికారులు స్థానికంగా ఉండాలని బయోమెట్రిక్ తప్పనిసరిగా పని చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

వసతి గృహాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మండల విద్యాధికారి సహకారం తీసుకోవాలని విద్యార్థులకు కావలసిన కుల దృవీకరణ పత్రము ఒకేసారి తీసుకోవాలని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుందని విద్యార్థులకు తెలియజేయాలన్నారు.

వసతి గృహాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఇంజనీరింగ్ అధికారులు వసతి గృహాలను పర్యవేక్షించి పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అన్నారు.

పదవ తరగతి విద్యార్థులకు ట్యూటర్ లను ఏర్పాటు చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నీ ఆదేశించారు విద్యార్థుల అల్పాహారం కొరకు ప్రభుత్వం అందజేస్తున్న నిధులను ఖర్చు చేస్తూ పౌష్టికాహారం సమకూర్చే బాధ్యత వసతిగృహ అధికారులదే నన్నారు.

పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా వసతి గృహాలలో సౌకర్యాలు మెరుగు పరుస్తామని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలియజేశారు అంతేగాక షెడ్యూల్ కులాల విద్యార్థుల ప్రగతికి టీవీ డిజిటల్ లైబ్రరీ జిమ్ స్పోర్ట్స్ మెటీరియల్, సోలార్ హీటర్, వంటివి సమకూరుస్తామన్నారు.

వసతి గృహాలకు ప్రభుత్వం అందజేస్తున్న బూట్లు సాక్సులు వంటి బ్రాండెడ్ కొనుగోలు కు ఐ టి డి ఎ, గురుకులం అధికారులను సంప్రదించి ఒకే ఖరీదు ఉండే విధంగా కొనుగోలు చేయాలన్నారు వసతిగృహాల ఆవరణలు భవనం పై భాగము పరిశుభ్రంగా ఉంచాలని చెత్తాచెదారాన్ని తొలగించాలన్నారు.

హాస్టల్స్లో స్థలాలు ఉన్నచోట కరివేపాకు మునగ టమాటా ఆకుకూరలు వంటివి పెంచాలన్నారు.

వసతి గృహాలను అందంగా తీర్చిదిద్దాలని విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలని తెలియజెప్పారు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే విహారయాత్రలు చేపట్టాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బాలరాజు ఇంజనీరింగ్ అధికారులు ఈ డబ్ల్యు ఐ డి సి ఈ ఈ దేవిదాస్ రావు ట్రైబల్ వెల్ఫేర్ డి ఈ మధుకర్ వసతిగృహాల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు
———————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post