విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించాలి. కృషియల్ నిధులతో చేపట్టిన పనులను తనిఖీ. వసతి గృహా లు, పాఠశాలలో కరోన నిబంధనలు పాటించాలి.::::: రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల శాఖ కమిషనర్ dr. యోగితా రాణా.

జిల్లాలో  సాంఘిక శాఖ ఆధ్వర్యంలో  నడుస్తున్న పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల శాఖ కమిషనర్ dr. యోగితా రాణా సంబంధిత అధికారులను ఆదేశించారు.  మంగళ వారం స్థానిక షెడ్యూల్డ్ కులముల కళాశాల, బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి ఆమె తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరోన పూర్తిగా సమసి పోలేదని  విద్యార్థులకు కరోన నిబంధనలు తప్పక పాటించేలా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. విద్యార్థుల సంక్షేమానికి నిధుల కొరత లేదని కృషియల్ స్కీం ద్వారా చేపట్టిన శానిటేషన్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై  రిపేర్ పనులను పరిశీలించి  నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం ఉండరాదని పిల్లల హాజరు శాతం ఇంకా పెరగాలని అలాగే ప్రవేటు పాఠశాలలు, కళాశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. వసతి గృహంలో ఉన్న ఇతర పనులకు మరో 15 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం బి. చంద్రుపట్ల లోని యస్.సి. బాలుర వసతి గృహాన్ని పరిశీలించి   జిల్లాలో అన్ని పాఠశాలలు, వసతి గృహాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రఅంగా ఉంచాలని కరోన నిబంధనలు తప్పక పాటించాలని వసతి గృహంలో పలు రికార్డులతో పాటు శానిటేషన్, ఎలక్ట్రికల్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
     ఈ సమావేశంలో  సంక్షేమ అధికారి దయానంద రాణి, HWO వాణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కృషియల్ నిధులతో చేపట్టిన పనులను తనిఖీ.
వసతి గృహా లు, పాఠశాలలో కరోన నిబంధనలు పాటించాలి.:::
రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల శాఖ కమిషనర్ dr. యోగితా రాణా.

Share This Post