విద్యార్థులకు ప్రిమెట్రీక్ స్కాలర్షిప్ కొరకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంస్థల వద్దనే సర్టిఫికేట్లను అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి. పువ్వాడ అజయకుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు 30,ఖమ్మం –

విద్యార్థులకు ప్రిమెట్రీక్ స్కాలర్షిప్ కొరకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంస్థల వద్దనే సర్టిఫికేట్లను అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి. పువ్వాడ అజయకుమార్ తెలిపారు. తహశీల్దార్లు వారి పరిధిలోని విద్యా సంస్థలు, కళాశాలలకు వెళ్లి విద్యా సంస్థల్లోనే సర్టిఫికేట్లను అందిస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గురువారం ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురం ప్రభుత్వ పాఠశాల, కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, పౌష్టికాహార అందిస్తూ భావి తరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయన్నారు. అందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకై రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి వద్దకే పంపిణీ చేయాలన్న నిర్ణయం మేరకు నేడు విద్యా సంస్థలలోనే ధృవీకరణ పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు మంచి సత్ఫలితాలనిస్తున్నాయని మత్రి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారని, నేడు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లీష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, నూడా చైర్మన్ బచ్చు. విజయ్ కుమార్, జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి కె.సత్యనారాయణ, ఆర్.డి.ఓ. రవీంద్రనాధ్, రఘునాథపాలెం మండలం తహశీల్దారు నర్సింహారావు, మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసరావు, ఖమ్మం  అర్బన్ మండలం తహశీల్దారు శైలజ, సర్పంచ్ గుడిపూడి శారద, కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post