ప్రచురణార్థం
మహబూబాబాద్ నవంబర్ 26.
సైన్స్ పేర్లు విద్యార్థులను మరింతగా ప్రభావితం చేస్తాయని మరిన్ని ఆవిష్కరణలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో “జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన”- 2022 ముగింపును పురస్కరించుకొని విద్యార్థుల రూపొందించిన ప్రయోగాత్మక స్టాల్స్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టరు విద్యార్థులతో మాట్లాడారు. వారు రూపొందించిన ప్రయోగాత్మక ప్రదర్శన ను పరిశీలిస్తూ వారి వ్యక్తిగత అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆసక్తిని గమనించి మరిన్ని ఆవిష్కరణలు చేపట్టి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు.
అవకాశాలు అందరికీ దరికి రావని మనమే వాటిని అందిపుచ్చుకోవాలని తెలియజేశారు.
ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తూ మరిన్ని ఆవిష్కరణలు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు ప్రభుత్వపరంగా తన వంతు కృషి చేస్తానన్నారు.
జిల్లాకు రాష్ట్రస్థాయిలో పేరు తేవాలన్నారు
విభిన్న పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన 239 ప్రయోగాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై సోషల్ వెల్ఫేర్ రెసిడెన్ స్కూల్ రూపా దేవి అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.