ప్రచురునార్ధం
డిసెంబర్,01.
గురువారం.
విద్యార్థులు అన్నీ రంగాల్లో రాణిoచాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు
గురువారం వరంగల్ రీజనల్ లెవెల్ ఇగ్నైట్ అండ్ సైన్స్ ఫెయిర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ప్రతిభ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి గారు ముఖ్య అతిధి గా పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు శాస్త్రీయ దృక్పథం పై అవగాహన కల్పిస్తూ పిల్లలను సైన్స్ ఫెయిర్ లు నిర్వహించుటకు ఉపాధ్యాయులు
ప్రోత్సహించాలని
అన్నారు
సబ్జెక్టు ల వారీగా కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చురుకుగా సమాధానం చెప్పడం తో కలెక్టర్ వారిని అభినందించారు.
ఈ సైన్స్ ఫెయిర్ లో కరీంనగర్,వరంగల్ రిజియన్ల వారిగా జరిగిన 11 ఈవెంట్స్ లలో 922 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ డిఎస్ వెంకన్న, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.