విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి . . . రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ పార్థసారథి

విద్యార్థులు తమ భయాందోళనల్ని విడిచి పెట్టి సంపూర్ణ మైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని, ఈనాటి వైజ్ఞానిక సమాజంలో మారుతున్న విద్యార్థులు సాంకేతికతను అర్థం చేసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని రాష్ట్ర ఎన్నికల కమిష నర్, తెలంగాణ విశ్వవిద్యాలయం పూర్వవైస్ ఛాన్సలర్ సి. పార్థసారధి ఉద్బోధించారు. తెలంగాణ విశ్వవిద్యాలయా స్థాపన దినోత్సవం సందర్భంగా గురువారం డిచ్ పల్లి మెయిన్ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కలాశాలలో జరిగిన కార్య గ్రామంలో పార్థసారథి ముఖ్య అతిధిగా పాల్గొని స్ఫూర్తిదాయ
కమైన ప్రసంగం చేశారు. అంతకు ముందు కార్య క్రమాన్ని ముఖ్య అతిథి పార్థ సారథి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో తన అనుభవాల్ని గురించి ఆసక్తికరంగా వివరించారు. తాను ఆర్మూర్ లో తెలుగు మాధ్యమం ద్వారా ఇంటర్మీ డియట్ వరకు చదువుకున్నానని, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరిన తరువాత ఎంతో గ్రహించి ఇంగ్లీషులో నైపుణ్యన్ని సాధించానని పార్థ సారధి వివరించారు. శ్రమించకుండా విజయాన్ని ఆకాంక్షించడం మంచిది కాదని ఆయన అన్నారు. విద్యార్థి తన జీవితంలో ఎదురయ్యే తొలి విజయాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని, విద్యార్థిలోని ప్రతిభా పాటవాల్ని ఆవిష్కరించ డంలో అధ్యాపకుల పాత్ర అమూల్యమైనదనీ సార్థసారథి. అభిప్రాయపడ్డారు. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పర్చుకోవా లని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. గతంలో తాను వైస్ చాన్స లర్ గా బాధ్యతలు నిర్వహించిన కాలంనాటి జ్ఞాపకాలను పార్థసారథి తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి అడుగు పెట్టడం తనకు గొప్ప అనుభూతిని కలిగిస్తుందని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయం సమష్టి కృషి ద్వారా అత్యున్నత సాయికి చేరుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్యడి. రవిందర్ గుప్తా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. 2006 సెప్టెంబర్ తెలంగాణ ఆరంభమైన విశ్వవిద్యాలయం ఎంతో ఆహ్లాదకరమైన వాతారరణంలో 597 ఎకరాల విస్తీర్ణంతో విద్యారంగంలో తన ప్రత్యేకతను సాధించిందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. విశ్వవిద్యాల యంలో భోధన, పరిశోధన రంగాలకు తగిన ప్రోత్సాహన్ని అందించే లక్ష్యంతో పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ఆచార్యా రవీందర్ అన్నారు. రాబోయే డిసెంబర్లో విశ్వవిద్యాలయంలో నానో టెక్నాలజీపై అంతర్జా తీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సదస్సు లో నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా పాల్గొంటూరని వీసీ వివరించారు.

తెలంగాణ విశ్వ విద్యాలయం గత పదిహేను సంవత్సరాల కాలంలో సాధించిన పురోగతికి రిజిస్ట్రార్ కనకయ్య తన ప్రసంగంలో వివరించారు. ఆరు విభాగాలతో ఆరంభమైన విశ్వవిద్యాలయం నేడు ముప్పయి విభాగాలకు విస్తరించిందని ఆయన చెప్పారు. బోధన పరిశోధనా రంగాలలో ఎంతో అను భవమున్నా, అధ్యాపకులు విశ్వవిద్యాలయంలో ఉన్నారని
ఆచార్య కనకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవిభాగం డీన్ ఆచార్య జి.వినోద్ కుమార్, నిజామాబాద్ జిల్లా అదనపు కరెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్.డి.ఏ. రవి పాల్గొన్నారు.

తొలుత కార్య క్రమానికి మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగరాజు స్వాగతం పలికారు. విశ్వవిద్యాల య అధ్యాపకులు. డాక్టర్ జి. శ్రీనివాసమూర్తి, ఏ. పున్నయ్యతో పాటు శ్రీనివాస్ మూర్తి, ప్రదీప్, సరిత, కరుణాకర్ లు ప్రసంగించారు. తెలంగాణ విద్వవిద్యాలయం ఆవిర్భవా నేపధ్యాన్ని వివరించారు. బోధన పరి శోధన రంగాల్లో ఉత్తమ సాయికి ఎంపికైన పలువురు అధ్యాపకులను ముఖ్య అతిధి పార్థసారథ, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లు ఘనంగా సత్కరించారు.

Share This Post