విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి తల్లిదండ్రుల పట్ల ప్రేమతో మెలగాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి.

పత్రిక ప్రకటన
తేది :12.11.2022
నిర్మల్ జిల్లా శనివారం

విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
తల్లిదండ్రుల పట్ల ప్రేమతో మెలగాలి :
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్
శనివారం బాసర ట్రిపుల్ ఐటీ పర్యటన సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, ఇంజనీరింగ్ విద్యా నైపుణ్యం -భవిష్యత్ అనే అంశం పై పలు సూచనలు సలహాలు చేశారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాసర ట్రిపుల్ ఐటి రాక సందర్భంగా జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, వైస్ చాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్,
ఏ ఎస్పీ కిరణ్ ఖారే లు పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఎకో పార్క్ ను ప్రారంభించి, నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్ ను సందర్శించి మొక్కలు నాటారు.
అనంతరం ఆడిటోరియంలో విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి కష్టపడే తత్వాన్ని అలవరుచుకొని ముందుకు సాగాలన్నారు. మన లక్ష్యాన్ని చేరే వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని, ఎవరు ఏమన్నా అలాంటి విమర్శలు పట్టించుకోకుండా లక్ష్యం దిశగా అడుగేయాలన్నారు.
తాను కూడా చదివే రోజుల్లో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నానని , ఇప్పుడున్నన్ని సదుపాయాలు అప్పుడు లేకపోయినా తెలుగు మాధ్యమం లోనే చదువుకొని సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించానని తెలిపారు.

అంతే కాకుండా విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి మధ్యే తిరుగుతూ, వారి మెదడు కి పని చెప్పే లా ప్రశ్నలు అడుగుతూ సరైన సమాధానం చెప్పిన వారికి బహుమతులు అందజేశారు.

యువత నిరాశ నిస్పృహాలను దరిచేరనివ్వకుండా గట్టి సంకల్పంతో ప్రయత్నించాలని
ఆ ప్రయత్నానికి ఏకాగ్రత తోడైతే ఆశించిన లక్ష్యాన్ని సునాయాసంగా చేదించవచ్చని అన్నారు.
చదువులో ముందుండడానికి పాటించవలసిన మెలకువలను అర్థవంతంగా ఆకట్టుకునే రీతిలో వివరిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు.
తన స్వీయ అనుభవాలను జోడించి పలు అంశాల పట్ల అవగాహన కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాల పై అవగాహన కల్పించారు.కొన్ని సాధించడానికి కొన్ని త్యాగం చేయక తప్పదని సూచించారు.
అంతే కాకుండా విద్యార్థులు వాయిదా వేయడం,బద్దకం, ఆత్మ న్యూనతా భావం, మొహమాటం విడిచి పెట్టి తమ పై తాము నమ్మకం పెంచుకోవాలని, ఆ దిశగా ముందుకు వెళ్ళాలని సూచించారు. అనంతరం బాసర అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీచింగ్, నాన్ టీచింగ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది

Share This Post