విద్యార్థులు కలలు కనాలి భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలి. – అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్

విద్యార్థులు కలలు కనాలి భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలి.

– అదనపు కలెక్టర్ మయన్క్ మిట్టల్

 

జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం విద్యావిభాగం వారి సౌజన్యంతో NEEDA (NARAYANAPET EDUCATIONAL EMPOWERMENT అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) స్వచ్ఛంద సంస్థ సారథ్యంలో జిల్లా స్థాయి ఓకేబులరీ టెస్ట్ బహుమతుల ప్రదానం స్థానిక అంజనా గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ శ్రీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ విద్యార్థులు విజయం సాధించాలంటే భవిష్యత్తు కై కలలు, దాన్ని సాధించే స్వయంకృషి, తల్లిదండ్రుల ప్రేమ, గురువుల ఆదరణ, సమాజ భాగస్వామ్యం అనే 5 అంశాలు ముడిపడి ఉంటాయని అన్నారు.

 

మారుమూల గ్రామల్లోంచి ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు హాజరవడం వారిలో ఆత్మస్థైర్యం పెంచిందని, అలాగే కేవలం 60 నిమిషాల వ్యవదిలో 400-550 ఆంగ్ల పదాలు వాటి అర్థాలు పిల్లలు రాయగలిగారంటే వారి శ్రమ పట్టుదల అనిర్వచనీయమన్నారు.

 

అంతకు ముందు కార్యక్రమాన్ని ప్రారంభించిన డీ ఈ ఓ లియాఖత్ అలీ విద్యార్థులదరూ ప్రత్యేకమైనవారని, ప్రతీ ఒక్కరికో ఒక్కో సామర్థ్యం ఉంటుందని దాన్ని ఉపాధ్యాయులు గుర్తించి సానబెట్టాలన్నారు.

 

ఏ ఎమ్ ఓ విద్యాసాగర్ మాట్లాడుతూ చిన్నారులు తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని వారి కళ్ళలో ఈరోజు చూసిన ఆనందం జీవితాంతం నిలపాలన్నారు.

 

జిల్లా స్థాయి పరీక్షకు 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రతీ కాంప్లెక్స్ నుండి ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచింది 447  మంది విద్యార్థులు పాల్గొన్నారు.

 

కార్యక్రమంలో విజేతలకు వెండి పథకాలు, డిక్షనరీలతో బహుకరించారు.

 

విజేతలుగా నిలిచిన విద్యార్థులు:

 

కార్యక్రమంలో NEEDA ప్రతినిధులు రమేష్ శెట్టి, నరేందర్, లక్ష్మణ్, రవి లతో బాటు  ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సుజేంద్ర శెట్టి, శ్రీనివాస్ గుప్తా, సురేందర్, సతీష్ పాలదీ మరియు జిల్లా లోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share This Post