విద్యార్థులు గొప్ప శాస్త్ర వేత్తలుగా ఎదగాలి – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

@ ప్రతిభను గుర్తించి పోత్సహించండి
@ విద్యార్థులు గొప్ప శాస్త్ర వేత్తలుగా ఎదగాలి – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

ప్రతి విద్యార్థిలోను ప్రతిభ దాగుంటుందని ,దాన్ని గుర్తించి ప్రోత్సహించ వలసిన అవసరం ఉపాధ్యాయులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక పర్యాటక, శాఖామంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

సోమవారం మహబూబ్ నగర్ లోని ఫాతీమా విద్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారని భవిష్యత్తులో ఏంకావాలో తల్లిదండ్రులే నిర్ణయిస్తున్నారని అన్నారు.మార్కులు తప్ప పిల్లల ఆకాంక్షలను తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదన్నారు. కేవలం చదువే కాకుండా సభ్యత, సంస్కారాన్ని, విలువలను అందించాల్సిన అవసరముందున్నారు. మంచి కన్నా, చెడు తొందరగా పిల్లలను ఆకర్శిస్తోందని, సినిమాలు, సీరియళ్లు , సెల్ ఫోన్ ల కారణంకా పిల్లలు దారి తప్పుతున్నారని అన్నారు. డిగ్రీవరకు పిల్లలు చదువుపైనే దృష్టిని సారించాలని పేర్కొంటూ తెలంగాణా ప్రభుత్వం చదువుకునేందుకు అనేక అవకాశాలను కల్పిస్తోన్నదని, విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకొని గొప్ప శాస్త్ర వేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు
శాస్త్ర వేత్తల నిరంతర కృషి ఫలితంగానే ఎన్నో భయంకరమైన వ్యాధులకు సులువైన పరిష్కారం దొరికిందని అన్నారు. చందమామ రావే జాబిల్లి రావే అంటూ అమాయకంగా తినిపించే రోజుల నుండి అదే చందమామపైకి వెళ్ళే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. అనాగరిక సమాజం నుండి నాగరిక సమాజం వరకు మానవుడి నిరంతర ఆలోచనలే ప్రగతికి దోహదపడ్డాయని మంత్రి అన్నారు.
హైదరాబాదుకు దీటుగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తున్నామని భవిష్యత్తులో అనేక అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి రవిందర్ అధ్యక్షతవహించారు.
మహబూబ్ నగర్ ఎం. పి. మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పి చైర్పర్సన్ స్వర్గాసుధాకర్ రెడ్డి మాట్లాడారు.
మున్సిపల్ చైర్మన్ కె.సి. నర్సింహులు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడు ,ముడా చైర్మన్ వెంకన్న, డీ.సిసి బి చైర్మన్ నిజాం పాష ,రైతు బంధు జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్ ,మార్కెట్ కమిటి చైర్మన్ రహమాన్ , సి.సికుంట జడ్పిటిసి రాజేశ్వరీ రాము ,జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సైన్స్ ఫెయిర్ లో 240 పాఠశాలల నుండి విద్యార్థులు 342 ప్రదర్శనలు వైజ్ఞానిక ప్రదర్శన లో ఏర్పాటు చేశారు.

 

Share This Post