విద్యార్థులు చదువుతోపాటు క్రీడలల్లోను రాణించాలి :MP బడుగుల లింగయ్య యాదవ్

– విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి – ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

 

విద్యార్థులు చదువుతో పాటు విద్యలో రాణించాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్ 16 మెన్ అండ్ ఉమెన్ యూత్ ఛాంపియన్షిప్ బాస్కెట్ బాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలైన జట్లకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్రీడాకారులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమలోని ప్రతిభను మెరుగుపరచుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డి దే అన్నారు. క్రీడలతో పట్టుదల గౌరవ గుర్తింపు వస్తుందని క్రీడాకారులు ఉత్సాహంగా ఆటల్లో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకొని జీవితంలో ముందుకు సాగాలన్నారు. అనంతరం బాలికల విభాగంలో మొదటి బహుమతి మేడ్చల్ మల్కాజ్ గిరి, ద్వితీయ బహుమతి ములుగు, మూడవ బహుమతి వికారాబాద్, బాలుర విభాగంలో మొదటి బహుమతి మేడ్చల్ మల్కాజిగిరి, ద్వితీయ బహుమతి వికారాబాద్, మూడవ బహుమతి కామారెడ్డి లకు మెడల్స్, మెమోంటో లను ప్రధానం చేసి అభినందించారు.

 

జిల్లాలోని బాస్కెట్బాల్ సీనియర్ క్రిడాకారులను కూడా ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సురేష్, జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, ఎస్ జిఎఫ్ సెక్రటరీ ఆజం బాబు, బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఫారుక్, జిల్లా పీఈటీల అధ్యక్షులు మల్లేశం ,రిటైర్డ్ పీఈటీలు, పిడీలు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post