విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలు దేహదారుడ్యం, మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని జిల్లా కలెక్టర్ వీ.పీ గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధ

ఏప్రిల్ 29 ఖమ్మం:–

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలు దేహదారుడ్యం, మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని జిల్లా కలెక్టర్ వీ.పీ గౌతమ్ అన్నారు. ముదిగొండ మండలం బాణాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన క్రీడాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులు, పి.ఇ.టి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ సమ్మర్ స్పోర్ట్స్ శిక్షణ క్యాంపులో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, ఆయా క్రీడా రంగాల్లో ఆసక్తి ఉన్న క్రీడల్లో విద్యార్థులను తీర్చి దిద్దాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మండలంలో మంచి టీము తయారు చేసారని విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో రాణించారని భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కలెక్టర్ కొరారు. విద్యాశాఖ నుండి పి.ఇ.టీలు అనుభవం కలిగిన కోచర్స్ సమ్మర్ క్యాంపులలో విద్యార్థులకు ఆసక్తి కలిగిన క్రీడాల్లో శిక్షణనిచ్చి నెలరోజుల్లో శిక్షణకు ముందు సమ్మర్ క్యాంపుల శిక్షణ తరువాత వారిలో ప్రతిభను గుర్తించి ప్రొఫైల్ తయారు చేయాలని సాధించిన ప్రగతిని తెలియజేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకంగా తీసుకున్న మనఊరు మనబడి కార్యక్రమంలో మొదటి దశలో బాణాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపిక అయిందని పాఠశాలకు కావల్సిన సదుపాయలు టాయిలెట్స్, కిచెన్ షెడ్, కాంపౌండ్వాల్, పెయింటింగ్, కంప్యూటర్ ల్యాబ్ వంటి వసతులను కల్పించుకొని వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభ సమయానికి అన్ని వసతులను పూర్తి చేసి కార్పోరేట్ స్థాయిని తలిపించే భావన విద్యార్థుల్లో మంచి వాతావరణం కల్పించేలా _చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరందామరెడ్డి, సి.ఎం.ఓ రాజశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేమ్ కుమార్, పి.ఇ.టి శ్రీనివాసరావు, తహశీల్దారు టి శ్రీనివాసరావు, ఎం.పి.డి.ఓ డి. శ్రీనివాసరావు, మండల విద్యాశాఖాధికారి బి.వి. రామాచారి ఎం.పి.టి.సి పర్చా రమ, గ్రామ సర్పంచ్ అవుల రమా లక్ష్మారెడ్డి, జడీ, హెచ్.ఎస్ బాణాపురం ఎస్.ఎం.సి చైర్మన్ ఎం. సామేలు, వి.శ్రీనివాస్, పాఠశాల ఉ పాధ్యాయులు, విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరుల పిఇటిలు, కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం బాణాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ సందర్శించి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి కొనుగోలు కేంద్రం బాధ్యులకు పలు సూచనలు చేసారు.

Share This Post