విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్ధారించుకొని అందుకు అనుగుణంగా కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు

విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్ధారించుకొని అందుకు అనుగుణంగా కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.  గురువారం ఉదయం  సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో వాయిస్ ఫర్ గర్ల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిశ వింటర్ క్యాంప్ 2021  ముగుంపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మాయిలు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, ఎల్లప్పుడూ ఎదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే తపన ఉండాలన్నారు.  ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు.  ఎప్పుడైతే నేర్చుకోవడం ఆగిపోతుందో మనిషి ఎదుగుదల ఆగిపోతుందని పేర్కొన్నారు.  చదువు ఒక్కటే కాకుండా విభిన్న  క్రీడలు, సంగీతం, నాట్యం లాంటి తమ అభిరుచులకు  అనుగుణంగా నేర్చుకుంటూ ఉండాలన్నారు.  94 సంవత్సరాల వయస్సు ఉన్న బామ్మ ఈ మధ్య 10వ తరగతి పరీక్ష రాశారని, అదేవిధంగా ఒకరు ఆటో  నడుపుతూ కష్ట పడి చదువుకొని ఐ.ఏ.ఎస్ సాధించారని ఉదహరించారు.  ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.  కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయని, వాటిని అధికమించి లక్ష్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని విద్యార్థినిలను ఉద్భోదించారు.  డిసెంబర్ 28 నుండి 11 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక దిశ శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసిన సందర్బంగా కలెక్టర్ విద్యార్థినిలతో ముచ్చటించారు.  జిల్లాలోని వేరు వేరు 5 పాఠశాలల నుండి 118 మంది యుక్త వయస్సు బాలికలకు సాధికారత కల్పించేందుకు వివిధ రకాలైన అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం దిశ ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.  దిశ వింటర్ క్యాంపును విజయవంతం చేసినందుకు వాయిస్ ఫర్ గర్ల్స్ డైరెక్టర్ ను అభినందించారు.  వేసవి కాలంలో మరో సఖి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వాయిస్ ఫర్ గర్ల్స్ డైరెక్టర్ తెలిపారు. సమావేశం ప్రారంభం లో డాక్టర్ అంబేత్కర్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమన్నీ ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థినీ బాల్యవివహాల పై చేసిన నాటిక కార్యక్రమాన్ని విద్యార్థినిలతో పాటు కింద కూర్చుని బాల్యవివహాల వలన కలిగే నష్టా పై చేసిన నటికను వైస్ ఫార్ గల్ల్స్ నిర్వహకులతో కలిసి తిలకించారు.

ఈ కార్యక్రమంలో వాయిస్ ఫర్ గర్ల్స్ డైరెక్టర్ అనూష భరద్వాజ్, ఫీల్డ్ కోఆర్డినేటర్ అనిషా కున్వర్, పాఠశాల ప్రిన్సిపాల్ దేవసేన  తదితరులు పాల్గొన్నారు.

Share This Post