విద్యార్థులు నూరు శాతం హాజరు కావాలి… జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం

విద్యార్థులు నూరు శాతం హాజరు కావాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 3.

విద్యార్థులు నూరు శాతం హాజరు కావాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు 18 సంవత్సరాలు దాటిన పిల్లలు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

జిల్లాలో 838 ఉపాధ్యాయులు 247 ఉద్యోగులు ఉన్నారని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు విద్యాసంస్థలలో మాస్కులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాఠశాలలో నీరు నిల్వ ఉండకుండా ఉపాధిహామీ నిధులతో పాఠశాల ఆవరణ పరిశుభ్రత పరచాలని అధికారులకు సూచించారు అదేవిధంగా కాంపౌండ్ లేనిచోట బ్రష్ వుడ్ తో రక్షణ ఏర్పాటు చేసుకోవాలన్నారు విద్యార్థుల నమోదు శాతం పై రోజువారి నివేదికలను అందజేయాలన్నారు.

జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశిస్తూ వ్యాక్సిన్ తీసుకునేవారు అధికంగా ఉన్న పాఠశాలల్లో వైద్యాధికారులు మొబైల్ వైద్య బృందం తో వెళ్లి వ్యాక్సిన్ అందజేయాలన్నారు.

విద్యాసంస్థల్లో స్కావెంజర్స్ లేనందున సంబంధిత గ్రామపంచాయతీ మల్టీ వర్కర్స్ మరుగుదొడ్లను శుభ్రపరచే ఈ విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి ని ఆదేశించారు.

విద్యా సంస్థల పై నమ్మకం కల్పించేందుకు పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియ చేసుకోవాలన్నారు.

విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా ఇంటింటికి వెళ్లి విద్య యొక్క ఆవశ్యకతను వివరించాలని అన్నారు అలాగే కోవిద్ లక్షణాలతో ఉన్నవారిని వారి ఇంటి వద్దనే ఉంచాలని ఆ వివరాలు వైద్యసిబ్బంది కి తెలియజేయాలన్నారు.

అదేవిధంగా కోవిద్ లక్షణాలు విద్యార్థుల్లో కనిపిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చికిత్స చేయించాలన్నారు.

వైద్య సిబ్బంది ప్రతిరోజు పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.

భోజనాలు,త్రాగునీరు, మరుగుదొడ్ల వద్ద విద్యార్థులను గుమికూడ కుండా చూడాలన్నారు. విద్యార్థుల నమోదుపై ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలకు మధ్య పోటీతత్వం ఉండాలన్నారు. తద్వారా విద్యార్థుల నమోదు శాతం పెరిగే అవకాశం ఉందన్నారు పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి వివరాలు ఉపాధ్యాయులకు తెలిసి ఉండాలని హాజరు శాతం పై దృష్టి పెట్టాలన్నారు. కేసముద్రం, మరిపెడ మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు
————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post